ఐదు మూల స్తంబాలతో రూపొందించిన జి.పి.ఎస్.తో ముందుకు వచ్చిన ప్రభుత్వం

 *సిపిఎస్ పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశం*

*•ఐదు మూల స్తంబాలతో రూపొందించిన జి.పి.ఎస్.తో ముందుకు వచ్చిన ప్రభుత్వంఅమరావతి, సెప్టెంబరు 7 (ప్రజా అమరావతి): ఉద్యోగుల కంట్రిబ్యూటరీ ఫెన్సన్ స్కీమ్(సిపిఎస్)అంశంపై బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాద్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కంట్రిబ్యూటరీ ఫెన్సన్ స్కీమ్(సిపిఎస్) కంటే మెరుగ్గా ముఖ్యమైన ఐదు మూల స్తంబాలతో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హామీ పెన్షన్ పథకం (జి.పి.ఎస్.) ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఒనగూరే లబ్దిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అధికారులు వివరించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హామీ పెన్షన్ పథకం (జి.పి.ఎస్.) తమకు ఏమాత్రం ఆమోదం కాదని, అమల్లో నున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానం(ఓపిఎస్)నే అమలు చేయాలని మంత్రుల కమిటీకి వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. 


ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ మాట్లాడుతూ ప్రజా స్వామ్య వ్యవస్థలో చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని, ఆ ఉద్దేశ్యంతోనే సి.పి.ఎస్. అంశంపై తరచుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధుతో చర్చలు నిర్వహించడం జరుగుచున్నదన్నారు.  ప్రభుత్వం ప్రతిపాదించే జి.పి.ఎస్. లో హామీ పింఛను, హామీ కుటుంభ భద్రత, హామీ కనీస పింఛనుతో పాటు ఆరోగ్య భద్రతను, ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్య భీమా సౌకర్యాన్ని చట్ట పరంగా కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.  ఈ విదానాన్ని కుణ్ణంగా పరిశీలించిన తదుపరి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందరూ తమ ఆమోదాన్ని తెలియజేయాలని ఆయన కోరారు. 


 పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తులను పురస్కరించుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ  గురుకులాల్లో మరియు యూనివర్సిటీల్లో పనిచేసే భోధన, బోధనేతర సిబ్బందికి కూడా  పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు .


 రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఆర్థిక శాఖ స్పెషల్ సి.ఎస్. ఎస్.ఎస్.రావత్,  ముఖ్య కార్యదర్శి(హెచ్ఆర్)చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్,జిఏడి కార్యదర్శి(సర్వీసెస్ మరియూ హెచ్ఆర్)హెచ్.అరుణ్ కుమార్,  ప్రభుత్వ(సలహాదారు ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు. అలాగే ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ తదితరులతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈసమావేశంలో పాల్గొన్నారు.


 

Comments