విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్ వొచ్చే ఏడాది పూర్తి చేసే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల


ని జిల్లా కలెక్టర్ డా. కె . మాధవీలత పేర్కొన్నారు.శనివారం సాయంత్రం కన్వర్షనల్ డిగ్రీ,  ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కింద చేపట్టే ఇంటర్న్ షిప్ పై  ఏ కే ఎన్ యూ వైస్ ఛాన్సలర్ ప్రో. ఎమ్. జనార్ధన రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన  జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటి నుంచే నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం డిగ్రీ రెండవ సంవత్సరం, ఇతర కోర్సులు పూర్తి చేసే వారు సుమారు 7900 మంది ఉండగా, వారిలో సుమారు 6 వేల 100 మంది డేటా ఎంట్రీ చెయ్యడం జరిగిందన్నారు. ఇంకా 1800 మంది వివరాలు సేకరణ చేపట్టవలసి ఉందన్నారు.  వివిధ కోర్స్ లలో డిగ్రీ, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదివే వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యం కలుగ చెయ్యాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా జిల్లా పరిధిలో ఉన్న వివిధ కంపెనీ లకు అవసరమైన నైపుణ్యం పెంచే విధంగా ఆయా కంపెనీ లతో చర్చించి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇందుకోసం వారికి ఉపయుక్తమైన అంశాల పై వారి ద్వారా నే ఇంటర్న్ షిప్, అప్రంటేస్,  ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయ్యాల్సి ఉందన్నారు.


ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము వైస్ ఛాన్సలర్ ప్రో. ఎమ్. జనార్ధన రావు మాట్లాడుతూ, సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లోనే కాకుండా ఫైన్ ఆర్ట్స్, సోషియాలజీ, ఎకనామిక్స్ , అకౌంటెన్సీ, కంప్యూటర్ డేటా, తదితర అంశాలపై కూడా శిక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.


ఈ సమావేశంలో రిజిస్టర్ ఆఫ్ యూనివర్సిటీ ప్రతినిధి ఆర్. సురేష్ వర్మ, సభ్యులు జే ఎన్ టి యూ రిజిస్టార్ ప్రో. సుమలత, అనిల్, లచ్చా రావు, పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Comments