రేపే వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు-2022 అవార్డుల ప్రదానం

 



విజయవాడ (ప్రజా అమరావతి);


*రేపే వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు-2022  అవార్డుల ప్రదానం*


*వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానోత్సవం*

 

*అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్*

 

*వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు 30 అవార్డులు*

 

*వ్యవసాయం, కళలు మరియు సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత,  విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు 20  వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ వార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు*

 

               వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు  వరుసగా రెండో ఏడాది “వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ - 2022” క్రింద 30 అత్యున్నత పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ  అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి వై.ఎస్. విజయమ్మ ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు అందజేయడం విశేషం.


       వ్యవసాయం, కళలు మరియు సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో  అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు ప్రదర్శించి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలను అవార్డులు వరించాయి. అందులో భాగంగా వ్యవసాయంలో 5, కళలు మరియు సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ప్రధానం చేయనున్నారు.  ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషి చేసి, విశిష్టసేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకే అవార్డుల్లో రాష్ట్ర హైపవర్ స్క్రీనింగ్ కమిటీ పెద్దపీట వేయడం జరిగింది. 

           

వైఎస్సార్ లైఫ్ టైమ్  అచీవ్ మెంట్  అవార్డు లో భాగంగా కళలు, సంస్కృతి విభాగంలో దర్శకులు, నటులు, కళాతపస్వి డా. కె. విశ్వనాథ్, తన చిత్రాల ద్వారా సామాజిక చైతన్యం కలిగిస్తున్న దర్శకులు, సినీ నటులు ఆర్ నారాయణమూర్తి కి ఈ అవార్డు లభించింది.


            సాహిత్య రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ కు అవార్డులు వచ్చాయి. అదే విధంగా  రాయలసీమకు సంబంధించిన ప్రసిద్ధ రచయిత డా.శాంతి నారాయణ కు ఈ అవార్డు లభించింది. 


           మహిళా, శిశు సాధికారత విభాగంలో ప్రజ్వల ఫౌండేషన్, శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ కు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు లభించింది. 


        విద్యకు సంబంధించి రిషి వ్యాలీ ఇన్ స్టిట్యూషన్- మదనపల్లి, జవహర్ భారతి ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్- కావలి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి.వి. పట్టాభిరామ్ కి ఈ అవార్డు లభించింది.


       మీడియా విభాగంలో భండారు శ్రీనివాసరావు, ఎం.సతీష్ చందర్, మంగు రాజగోపాల్, ఎం.ఈ.వి. ప్రసాద రెడ్డిలకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు లభించింది. 


                  వైద్య రంగంలో  కొన్ని లక్షల మందికి, కొన్ని దశాబ్ధాలుగా వైద్యం అందిస్తున్న అపోలో హాస్పిటల్స్  యాజమాన్యం డా.సి.ప్రతాప్ రెడ్డి కి, తెలుగు వారందరికీ సుపరిచితమైన గొప్ప కంటి సంస్థ  ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్, శాంత బయోటెక్ సంస్థ అధినేత డా. వర ప్రసాద్ రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డా. డి. నాగేశ్వర్ రెడ్డి, కరోనా విపత్కర సమయంలో కోవాగ్జిన్ ద్వారా అందించిన సేవను గుర్తిస్తూ భారత్ బయోటెక్ సంస్థ అధిపతులు డా. సుచిత్ర యెల్లా మరియు డా. కృష్ణ యెల్లాకు, పరిశ్రమల విభాగంలో జీఎంఆర్ గ్రూప్స్ అధినేత గ్రంథి మల్లిఖార్జున రావుకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు లభించింది.


          వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులో భాగంగా వ్యవసాయ విభాగంలో విశేష సేవలకు గుర్తింపుగా ఆదివాసి క్యాషూనెట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కు, కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, శ్రీ అన్నమయ్య మ్యూచువల్లీ  ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, అమృతఫల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కు, చిత్తూరు  జిల్లాకు చెందిన కట్టమంచి  కట్టమంచి బాలకృష్ణారెడ్డికి ఈ అవార్డు లభించింది. మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తూ కళలు, సంస్కృతి విభాగంలో రంగస్థల నటులు నాయుడు గోపి, కలంకారి నైపుణ్యంలో విశిష్ట ప్రతిభ కనబర్చిన పిచ్చుక శ్రీనివాస్, హస్తకళా నైపుణ్యంలో షేక్ గౌసియా బేగంకి ఈ అవార్డు లభించింది. 


         మహిళా, శిశు సాధికారత విభాగంలో దిశ యాప్ కు సంబంధించి ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం నిమిషాల్లో స్పందించి చొరవ చూపిన ఐదుగురు పోలీసులు రవాడ జయంతి, ఎస్.వి.వి. లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రమణ్యం, హజ్రతయ్య, టి.శ్రీనివాసరావు కు ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు లభించింది. విద్య విభాగంలో బ్యాంకింగ్ రంగంలో టెక్నో సేవలు అందించిన  పి.దస్తగిరి రెడ్డికి ఈ అవార్డు లభించింది.


        మొత్తంగా రేపు జరిగే కార్యక్రమంలో 20 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ వార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులను 35 మంది వ్యక్తులు, సంస్థలకు అందించడం జరుగుతుంది.


           వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ క్రింద ఎంపికైన వారికి 10 లక్షల నగదు బహుమతి, వైఎస్ఆర్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతంది. అదే విధంగా వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు క్రింద ఎంపికైన వారికి రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. 



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image