ప్రతి ఏటా 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాలని కోరిన కేరళ ప్రతినిధి బృందం..

 

విజయవాడ (ప్రజా అమరావతి);

** రాష్ట్రంలో అమలులో ఉన్న ఇంటింటికీ రేషన్ పధకం ను అభినందించిన కేరళ రాష్ట్ర ప్రతినిధి బృందం.. 

** ప్రతి ఏటా 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాలని కోరిన కేరళ ప్రతినిధి బృందం.. 

** కందులు, మినుములు, పెసలు కూడా సరఫరా చేయాలని కోరిన కేరళ ప్రతినిధి బృందం.. 

** ఈ నెల 27న కేరళలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించనున్న రాష్ట్ర ప్రతినిధి బృందం.  అనంతరం రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకునే అవకాశం.. 

- రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వర రావు.. 

కేరళ రాష్ట్రానికి 60 వేల మెట్రిక్ తన్నులు ఎమ్ టి యు 3626 (బొండాలు) జయ వెరైటీ బియ్యం ను సరఫరా చేయాలని కేరళ ప్రభుత్వం కోరుతున్నదని ఇందుకు సంబంధించి రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వర రావు అన్నారు.  కానూరు సివిల్ సప్లైస్ భవన్ లో సోమవారం కేరళ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ జి. ఆర్. అనిల్, కేరళ రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు పాత్రికేయులకు వివరాలు వెల్లడించారు.  

ఈసందర్భంగా మంత్రి నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతి ఏటా 60 వేల మెట్రిక్ టన్నుల జయ వెరైటీ బియ్యం తో పాటు  కందిపప్పు, పెసలు, మినుములు, ఎండు మిర్చి మొదలగు వాటిని కూడా  కేరళ రాష్ట్రం కొనుగోలు చేస్తున్నదని ఇందుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కేరళ ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేశారన్నారు.  కేరళ ప్రభుత్వం మిరప నెలకు 550 టన్నులు అవసరం అవుతుందని తెలియజేసిందన్నారు.  కేరళ వినియోగదారుల డిమాండ్ ను తీర్చడానికి జయ బియ్యం మరియు ఎండు మిర్చి సరఫరా కొరకు పౌరసరఫరాల శాఖ మరియు ఏ.పి. మార్క్ ఫెడ్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేరళ బృందం ఆసక్తి వ్యక్తం చేసిందన్నారు.  ప్రతీ నెల 4500 టన్నుల జయ బియ్యం, 550 టన్నుల ఎండు మిర్చి అవసరం ఉంటుందని కేరళ ప్రతినిధి బృందం తెలియజేసిందన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ప్రవేశ పెట్టిన మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ (ఎమ్ డి యు) ద్వారా ఇంటింటికీ రేషన్ పధకం అమలు పరిశీలించిన  కేరళ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిందన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన విషయాలన్నింటిపై ఈనెల 27వ తేదీన కేరళ లో క్షేత్ర స్థాయిలో రెండు ప్రభుత్వాల ప్రతినిధి బృందాలతో సమావేశం నిర్వహించనున్నామని మంత్రి నాగేశ్వర రావు తెలిపారు. 

నెల్లూరు జిల్లాలో  పౌరసరఫరాల శాఖలో రూ. 30 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లుగా ప్రాధమికంగా నిర్ధారించమని ఇందుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు  ఉద్యోగులను సస్పెండ్ చేశామని తెలిపారు.  2017వ సంవత్సరం నుంచి ఈ స్కాం జరుగుతున్నదని ఆడిట్ నిర్వహించి ప్రాధమిక నిర్దారణకు వచ్చామన్నారు.  ఇందుకు బాద్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు.  ఈ పరిస్థితిపై పూర్తి స్థాయి విచారణకు సి ఐ డి ఎంక్వయిరీ చేపట్టాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని కోరనున్నామని మంత్రి నాగేశ్వర రావు తెలిపారు.   రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సకాలంలో ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుందని మంత్రి అన్నారు.  రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుకు చెల్లించవలసిన సొమ్ము ఎటువంటి పెండింగ్ లేదని మంత్రి నాగేశ్వర రావు అన్నారు. 

ఈ సమావేశంలో కేరళ ప్రభుత్వం ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల మంత్రి  ప్రైవేట్ సెక్రటరీ శ్రీ. పి. ప్రదీప్‌కుమార్, కేరళ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంజీబ్ కుమార్ పట్జోషి, కేరళ ప్రభుత్వం పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల కమీషనర్ డా. డి. సజిత్ బాబు, రిజిస్ట్రార్ & కమీషనర్, సహకార సంఘాలు శ్రీ.  A. బాబు, ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల కమీషనర్ శ్రీ. హెచ్.అరుణ్ కుమార్, విజయవాడ APSCSCL VC & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. జి.వీరపాండియన్, డైరెక్టర్, పౌరసరఫరాల శాఖ శ్రీమతి. M.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image