కీచక టీడీపీ నేతల అరాచకాలకు చంద్రబాబే కారణం


కీచక టీడీపీ నేతల అరాచకాలకు చంద్రబాబే కారణం


- కదిరి టీడీపీ నేత లైంగిక వేధింపుల ఘటనపై 'వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆగ్రహం

- కఠినచర్యలకు సత్యసాయి జిల్లా ఎస్పీకి ఆదేశాలు


అమరావతి (ప్రజా అమరావతి):

లైంగిక వేధింపులకు పాల్పడి మైనర్ బాలికలను పొట్టనబెట్టుకుంటున్న కీచక టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వత్తాసుపలికి వెనుకేసుకురావడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ నేత ఇంతియాజ్ లైంగిక వేధింపులకు బలైన మైనర్ బాలిక ఉదంతంపై గురువారం వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఆగ్రహించారు.

ఘటనపై సత్యసాయి జిల్లా ఎస్పీ, కదిరి డీఎస్పీతో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలకు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనంత, సత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల వేధింపులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెనుకేసుకురావడమే ప్రధాన కారణమన్నారు. విజయవాడ వినోద్ జైన్ కేసు, లోకేష్ పీఏ వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదిచ్చిన సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు గట్టిగా బుద్ధిచెప్పి ఉంటే.. ఇలాంటి ఘటనలకు తావుండేది కాదన్నారు. మైనర్ బాలికల అఘాయిత్యాలపై సభ్య సమాజానికి టీడీపీ ఇచ్చే సందేశమేంటని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రాజకీయపార్టీల్లో ఏ స్థాయి నేతలైనప్పటికీ అఘాయిత్యాలకు బరితెగించే వారికి కఠిన సందేశం పంపాలని మహిళా కమిషన్ భావిస్తుందని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.


Comments