అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కల్పించుటకు ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ పనిచేస్తున్నది

 

విజయవాడ (ప్రజా అమరావతి);

అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కల్పించుటకు ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ పనిచేస్తున్నదని కమిషన్ చైర్మన్ సి.హెచ్. విజయ ప్రతాప రెడ్డి అన్నారు. 

విజయవాడ అశోక్ నగర్ లోని ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ కార్యాలయంలో బుధవారం కమిషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.  సమావేశం అనంతరం కమిషన్ చైర్మన్ విజయప్రతాప రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రకారం ఆకలి మరణాలు ఉండకూడదని ఈ దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల ద్వారా అర్హులైన వారందరికీ బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహార కమిషన్ రాష్ట్రంలో ది. 7-8-2017 నుండి పనిచేస్తున్నదన్నారు.  ఆహార కమిషన్ చైర్మన్ గా ఇంతవరకూ 19 జిల్లాలలో పర్యటించి 366 సెంటర్ లను తనిఖీ చేసి కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న లోటుపాట్లను గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు.  6A కేసులతో పాటు ఒక అంగన్ వాడి ఉద్యోగిని విధుల నుండి తొలిగించామన్నారు.  డిసెంబర్ 2022 నాటికి అన్ని జిల్లాలలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతకు అమలు చేస్తున్న పధకాల ద్వారా నిరుపేదలైన లబ్ది దారులకు అందుతున్న ప్రయోజనాలను సమీక్షించనున్నామన్నారు.  ఆహార భద్రతకు సంబంధిత పథకాలైన ప్రజాపంపిణీ వ్యవస్థ, మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అమలు చేస్తున్న పధకాలు, మధ్యాహ్న భోజన పధకం, సంక్షేమ హాస్టర్ విద్యార్థులకు భోజన, వసతులు, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పధకం అమలుపై కమిషన్ అన్ని జిల్లాల్లోనూ సమీక్షించి తగు చర్యలు తీసుకుంటుందన్నారు.   ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సవరించడం, సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడం, తప్పులు ఎక్కువగా ఉన్నచో సుమోటోగా తీసుకుని కేసులు పెట్టడం, జరిమానా విధించడం, అవకతవకలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం ఆహార కమిషన్ యొక్క ముఖ్యమైన విధి విధానాలని చైర్మన్ విజయ ప్రతాప రెడ్డి పేర్కొన్నారు.  

పై తెలిపిన విషయాలకు సంబంధించి బాధ్యతాయుతమైన పౌరులెవరైనా సమస్యలను గానీ, జరుగుతున్న అవకతవకలు గానీ కమిషన్ దృష్టికి తీసుకు రావచ్చునని చైర్మన్ అన్నారు.  ఫిర్యాదులు పంపే వారు వాట్సాప్ నెంబరు 9490551117 కు పంపించాలని, ఫోన్ చేసి ఫిర్యాదు చేయగోరేవారు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2388 నకుగానీ ఫోన్ చేసి తెలియజేయవచ్చునన్నారు.  ఈ మెయిల్ ద్వారా పంపగోరేవారు apstatefoodcommission@gmail.com కు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.  

ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యులు శ్రీ బక్కముంతల కాంతారావు, శ్రీ లక్ష్మీరెడ్డి ఇండేలా, శ్రీ జక్కంపూడి కిరణ్ లు, ఫుడ్ కమిషన్ మెంబెర్ సెక్రటరీ ఎమ్. సునీత, ఉపసంచాలకులు పి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.   


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image