పొదుపు మహిళల మెరుగైన జీవనోపాధికి చేయూత మహిళా మార్ట్...


పొదుపు మహిళల మెరుగైన జీవనోపాధికి చేయూత మహిళా మార్ట్...

చేయూత మహిళా మార్ట్ లతో ఆర్ధిక ప్రగతి...

జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన తొలి మహిళా మార్ట్.. త్వరలో చింతలపూడి లో ప్రారంభం...

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, శాసన సభ్యులు వి.ఆర్. ఎలీజా..

 

ఏలూరు/జంగారెడ్డిగూడెం,  అక్టోబరు, 28 (ప్రజా అమరావతి).. మహిళలు మెరుగైన జీవనోపాధికి జిల్లాలో తొలిగా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ జిల్లాకే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు.  స్వయం సహాయ సంఘాల మహిళలతో జిల్లాలోనే తొలిసారిగా జంగారెడ్డిగూడెం మండలంలో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ ను శుక్రవారం చింతలపూడి శాసన సభ్యులు వి.ఆర్. ఎలీజా తో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ ను బాగా నడిపి ఆదర్శంగా నిలబడాలన్నారు.  దీనిని బట్టి మిగతా వారు ఏర్పాటుకు ముందుకు వస్తారన్నారు.  మిగతా నియోజకవర్గాల్లో కొత్తగా చేయూత మహిళా మార్ట్ లు ఏర్పాటుకు జంగారెడ్డిగూడెం మహిళా మార్ట్ రోల్ మోడల్ గా నిలవాలన్నారు.  ఇక్కడ 1500 గ్రూపులకు చెందిన మహిళలు రూ. 300 చొప్పున తమ వాటాగా 40 లక్షలు రూపాయలు మూల ధనంగా మార్ట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.  ఈ మార్ట్ ల్లో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే నాణ్యమైన నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు.  ఇటువంటి మహిళా మార్ట్ లు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.  అందరూ కలిసి గట్టి కృషితో లాభాలను అందుకోవాలన్నారు.  రిలయన్స్, వాల్ మార్ట్, డిమార్ట్ వంటి ఎన్నో సూపర్ మార్కెట్లు ఉన్నాయని వాటికి ధీటుగా చేయూత మహిళా మార్ట్ లు నిలవాలన్నారు.  మహిళా మార్ట్ లో సభ్యులే కాకుండా మిగిలిన మహిళలంతా సహకరించాలన్నారు.  పంచధార, వంటనూనె వంటివి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇక్కడ తక్కువ ధరకే అందించబడతాయన్నారు.  ఈ మార్ట్ లో డిస్ప్లే చేసిన వస్తువులనే కాకుండా లాభం వస్తుందని భావిస్తే ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి చీరలు టోకున కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించుకోవచ్చునన్నారు.  అదే విధంగా పరిసర ప్రాంతాల్లో సేంద్రీయ కాయగూరలు పండించే కొంతమంది రైతులతో సమన్వయం చేసుకొని టోకున ఆర్గానిక్ కాయకూరలు కొనుగోలు చేసి మార్ట్ లో విక్రయించేందుకు చొరవ చూపాలన్నారు.  మరింత పనివారిని పెట్టుకొని డోర్ డెలివరి చేసే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.  ఈ మధ్య కాలంలోజుమాటో, స్విగ్గీ వంటి డోర్ డెలివరి ద్వారా సరుకులు పొందే అలవాటు పెరిగినందున ఆదిశగా మార్ట్ లోని వస్తువులు విక్రయానికి ప్రయత్నాలు చేయాలన్నారు.  మార్ట్ ఏర్పాటు చేసిన  భవనం ఉచితంగా లభించడం ఒక ప్రయోజన కారిగా ఉంటుందన్నారు.  ఈ భవనంపైన మరో అంతస్తు ఖాళీగా ఉన్నందున  రంజాన్, క్రిష్టమస్, సంక్రాంతి  వంటి పండుగ సమయాల్లో హోల్ సేల్ గా వస్తువులు కొనుగోలు చేసి విక్రయించేందుకు సిద్దపడాలన్నారు.  ఇటువంటి సమయంలో ఆయా సంస్ధలు నుండి కొనుగోలు చేసిన వస్తువులు మిగిలిపోయిన నిర్ధిష్ట కాలపరిమితిలో తిరిగి తీసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు.

గృహనిర్మాణాలు చేపట్టండి...  పేదలందరికి ఇళ్లు ఉండాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం అందించిన ఇంటి స్ధలంలో ఇళ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ లబ్దిదారులను కోరారు.  ఇళ్ల నిర్మాణానికి మహిళలకందరికి రూ. 35 వేలు వడ్డీలేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు.  ఇళ్ల స్ధలం తీసుకున్న ప్రతిఒక్కరూ ఇళ్లు నిర్మించుకోవాలన్నారు.  కోర్టు కేసుల్లో ఉన్న ఇంటి స్ధలాల సమస్యను కూడా త్వరలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.  ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ. 2.10 లక్షలు అందిస్తున్న సొమ్ముకు అధనంగా తమ స్తోమతను బట్టి మరింత వెచ్చించి నిర్మించుకోవచ్చన్నారు.  లబ్దిదారులు స్వయంగా నిర్మించుకోలేని పక్షంలో కాంట్రాక్టర్ల ద్వారా టై అప్ చేసి నిర్మించేందుకు గృహనిర్మాణశాఖ చేయూత నందిస్తుందన్నారు.  ప్రతి ఒక్కరూ చక్కగా ఇళ్లు నిర్మించుకొని నివశించాలని ఆయన ఆకాంక్షించారు.  

చింతలపూడి శాసన సభ్యులు వి.ఆర్. ఎలీజా మాట్లాడుతూ మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన గొప్ప ఆలోచనకు ప్రతిరూపం చేయూత మహిళా మార్ట్ అని అన్నారు.  నవరత్నాల పథకాలు ద్వారా పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ , చేయూత వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు.  స్వయం సహాయ సంఘాల మహిళల ఆర్ధిక సాధికారతకు తోడ్పాటునందించేందుకు చేయూత మహిళా మార్ట్ లు ఎంతో దోహదపడతాయన్నారు.  జిల్లా తొలి చేయూత మహిళా మార్ట్ చింతలపూడి నియోజకవర్గంలో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు.  మహిళా మార్ట్ లో డ్వాక్రా మహిళలు తయారుచేసే అన్ని వస్తువులను కూడా విక్రయించేందుకు మంచి మార్కెటింగ్ సదుపాయం కూడా కలుగుతుందన్నారు. మహిళలకు సుస్తిర జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న చేయూత మహిళా మార్ట్ లు వారికి ఎంతో తోడ్పాటును అందిస్తాయన్నారు.  మహిళల సంక్షేమానికి, వారి ఆర్ధిక సాధికారతకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు.  అటువంటి ముఖ్యమంత్రిని మహిళలు గుండెల్లో పెట్టుకొని నిండుమనస్సుతో ఆశీర్వదించాలన్నారు. 

 ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పిటిసి పోలినాటి బాబ్జి, యంపిపి కొదమ జ్యోతి, మహిళా శిశు సంక్షేమం రీజనల్ కో-ఆర్డినేటర్ వందనపు సాయిబాలపద్మ, ఎఎంసి చైర్మన్ జె. జానకీ రెడ్డి, ఎన్ సిడి ప్రోగ్రాం ఆఫీసరు డా. సిహెచ్ మానస, ఆర్డిఓ ఝాన్సీరాణి, డిఆర్డిఏ పిడి విజయరాజు, మండల ప్రత్యేకాధికారి ఎన్.ఎస్. కృపావరం, మున్సిపల్ కమీషనరు పి. భవానీ ప్రసాద్,  వై.ఎస్.ఆర్. సిపి నాయకులు చంద్రరావు, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image