జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు 'మహిళా కమిషన్' నోటీసు



జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు 'మహిళా కమిషన్' నోటీసు


*మూడు పెళ్లిళ్లపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలి: వాసిరెడ్డి పద్మ


*మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ ఆదేశం.

అమరావతి (ప్రజా అమరావతి):

మూడు పెళ్లిళ్లపై ఇటీవల జనసేన రాష్ట్ర  అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు శనివారం  జనసేనాని పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై  చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారాన్ని రేపాయని తెలిపారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్నిస్తూ పవన్ కళ్యాణ్  మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్ కు గురైందన్నారు. తన మాటల్లోని తప్పు తెలుసుకుని పవన్ కల్యాణ్ మహిళా లోకానికి వెంటనే సంజాయిషీ ఇస్తారని మహిళా కమిషన్ ఎదురు చూసిందన్నారు.ఇన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ లో పశ్చాత్తాపం తో పాటు  మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు క్షమాణలు కూడా లేవన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమేనన్నారు. కోట్ల రూపాయల భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, చేతనైతే మీరు కూడా చేసుకోండని అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారని ప్రశ్నించారు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణమిచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే ఏ మహిళ జీవితానికి  భద్రత ఉంటుంది? ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్లిళ్లపై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా? అని మహిళా కమిషన్ నిలదూశారు.  పవన్ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి 'స్టెప్నీ' అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. మహిళలను భోగ వస్తువు గా, అంగడి సరుకుగా  భావించే వారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారని గుర్తుచేశారు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేకమంది మహిళలు మహిళా ఫిర్యాదు చేశారని, పవన్ మాటలు  అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మహిళలను కించపరిచే మాటలు మాట్లాడటం, చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడం పై  పవన్ కళ్యాణ్ తక్షణమే క్షమాణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని   నోటీస్ జారీ చేసినట్లు  రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. 


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image