పీఎం లంక అభివృద్ధి కి ప్రజల భాగస్వామ్యం మరువలేనిదిపిఎం లంక: అక్టోబర్ 27 (ప్రజా అమరావతి);


పీఎం లంక అభివృద్ధి కి ప్రజల భాగస్వామ్యం మరువలేనిద


ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.


గురువారం పీఎం లంక గ్రామంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగింది.  రక్షిత మంచినీటి పథకం, గ్రామ సచివాలయ భవనం, డిజిటల్ భవనాల ప్రారంభోత్సవం, తీర గ్రామాలకు రక్షణగా గ్లోయిన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.  నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.  చివరిగా 32 మంది లబ్ధిదారులకు ముద్ర రుణాల క్రింద రూ.1.82 కోట్ల చెక్కును అందజేయడం జరిగింది.  దత్తత గ్రామం పెదమైన వానిలంక  బహిరంగ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ నేను ఢిల్లీ నుంచి పీఎం లంకకు వస్తే సొంత ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. 2015 లో ప్రధాన మంత్రి సన్సపద్ ఆదర్శ గ్రామ యోజన పథకంలో పి.ఎం లంక  గ్రామాన్ని దత్తతగా తీసుకోవడం జరిగిందన్నారు. అధునాతన బయో ఢీ కంపోజింగ్ టాయిలెట్లు  నిర్మాణం పీఎం లంక లో చేపట్టడం జరిగిందన్నారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని ఈ గ్రామస్తులు తనకు చెప్పారన్నారు. దీనికోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సెంటర్ ఏర్పాటుతో జిల్లాలోని వారు అందరూ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుందన్నారు. నేడు పీఎం లంక గ్రామం మారుమూల ప్రాంతం కాదని అభివృద్ధి కి కేంద్ర బిందువుగా మారిందన్నారు.  సముద్రపుకోత ఇక్కడ పెద్ద సమస్యగా మారిందన్నారు.

సముద్రం గ్రామంలోకి రాకుండా నూతన టెక్నాలజీ తో తీర గ్రామాలకు రక్షణగా గ్లోయిన్స్ నిర్మానానికి పైలెట్ ప్రోజెక్ట్ ను చేపట్టనున్న మన్నారు. సాధారణంగా సముద్రం ఉత్తరం నుండి దక్షిణం వైపు పోటు ఉంటుందని, కానీ ఈ ప్రాంతంలో తూర్ఫు నుండి పడమరకు సముద్రపు పోటు రావడం వలన సముద్రం కోతకు గురవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించి గుర్తించడం జరిగింది. తొలి విడత గా పీఎం లంక  లో 15 కోట్ల వ్యయం తో కిలో మీటరు మేర  సముద్ర కోత నివారణ కు  పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలిపారు.


రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ

ఏ మ్యాజిక్ లేదు... పీఎం లంక బీచ్ నుండి ఇక్కడికి వచ్చే వరకు అంతా అమ్మ జిందాబాదే వినిపించింది. డిలైట్ కంపెనీ వారు పీఎం లంక గ్రామం  సముద్ర కోతకు గురికాకుండా పరిష్కారం చూపారన్నారు. పీఎం లంక ను కేంద్ర ఆర్థిక మంత్రి దత్తత తీసుకోవడం ఇక్కడి గ్రామస్తుల అదృష్టం అన్నారు. జీయో ట్యూబ్  తో కిలో మీటరు పొడవున సాంకేతికతను ఉపయోగించి సముద్ర కోతను నివారించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కిలో మీటరుకు రూ.15 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

అలాగే పీఎం లంక లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసుల అదృష్టం అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచనల అమలుకు పీఎం లంక లో అన్ని ఏర్పాట్లు చేయాలనీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. పరిపాలనలో 

మహిళలసాధికారతకు కృషి చేస్తున్నారన్నారు.


నరసాపురం శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ పెదమైన వానిలంక  శివారు గ్రామం.

ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు.  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ దత్తతకు తీసుకుని 

మూడు నర్ర కోట్ల తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు. రూ.4  లక్షలతో  వాటర్ టాంక్,  రూ.40 లక్షలతో సచివాలయ భవనాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేశామన్నారు.

సముద్రపు కోతకు గురికాకుండా రూ.15 కోట్ల తో పనులకు శంకుస్థాపన చేశారన్నారు. 20 కోట్ల తో పెదమైన వాని లంక నుండి నర్సాపురం వరకు అర్  అండ్  బీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కే.బి పాలెం నుండి బియ్యపు తిప్ప వరకు 18 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉందని,  ఇప్పటికే 6 కిలో మీటర్లు మేర రోడ్డు ఉందన్నారు.  మిగిలిన దూరం రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. బియ్యపుతిప్పలో రూ.450 కోట్ల తో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కు ముఖ్యమంత్రి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.


జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  పిఎం లంకను దత్తతగా తీసుకోవడం అంటే అభివృద్ధికి పెద్దపేట వేసినట్టే అన్నారు. ఇదే గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.  ఇక్కడ ఈ గ్రామానికి సముద్రపు కోత అనేది ప్రధాన సమస్య ఉందని దీనికి కూడా ఈరోజు ఒక చక్కటి పరిష్కారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ద్వారా లభించిందన్నారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్య  సంపద యోజన పథకం ద్వారా కరోనా సమయంలో మత్స్య కారులకు నరేంద్ర మోడీ అండగా నిలిచారన్నారు. 2014 నుండి 2019 వరకు ఫిషింగ్ హార్బర్ ల పై గత పాలకులు దృష్టి పెట్టలేదన్నారు. ఈ ప్రభుత్వం  హయాంలో బియ్యపు తిప్పలో  ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం శుభపరిణామం అన్నారు. రూ.8 లక్షల 16 కోట్లు రాష్ట్ర అభివృద్ధి కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేటాయించారన్నారు.


ఈ కార్యక్రమాల్లో జడ్పి చైర్మన్ కవురు శ్రీనివాస్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ షేమ్ షేర్ సింగ్ రావత్, ఆర్థిక శాఖ సెక్రటరీ కె.వి.వి సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వి మురళి, నరసాపురం సబ్ కలెక్టర్ సూర్య తేజ, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన పెండ్ర వీరన్న,  గ్రామ సర్పంచ్ కొల్లాటి కనకదుర్గ, జడ్పిటిసి ఎంపిటిసి సభ్యులు స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image