పార్వతీపురంలో గంట స్తంభం



*పార్వతీపురంలో గంట స్తంభం*



పార్వతీపురం, అక్టోబర్ 15 (ప్రజా అమరావతి): పార్వతీపురంలో గంట స్తంభం నిర్మించుటకు యోచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. పార్వతీపురం పట్టణంలో స్థల గుర్తింపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శని వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంట స్తంభం నిర్మాణానికి పట్టణ, జిల్లా ప్రజలు మంచి సూచనలు, సలహాలు అందించాలని దానితోపాటు మంచి నమూనాలు (డిజైన్) 10 రోజుల్లో ఇవ్వాలని కోరారు. త్వరలో స్థలం నిర్ణయించి మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. జిల్లా ఏర్పడి ఏడాది పూర్తి అయ్యే నాటికి సిద్ధం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. 


*నీటి వసతులను పరిరక్షించు కోవాలి*


జిల్లాలో నీటి వసతుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. పార్వతీపురం పట్టణం, దాని చుట్టు ప్రక్కల ఉన్న నీటి వసతుల ప్రాదాన్యత మరింత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. పెద్ద నగరాలు, పట్టణాలు  వరదల సమయంలో ముంపుకు గురి కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే గత రెండు వారాలుగా ప్రత్యేక బృందాలు సర్వే చేపట్టి పలు చెరువులు, బందలు గుర్తించడం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో పార్వతీపురం పట్టణం వరదలకు గురి కాకుండా ఉండుటకు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వం  చెరువుల పరిరక్షణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. బాల గొడబలో లెంకల చెరువు, పార్వతీపురంలో నెల్లి చెరువు, దేవుని బంద, సుందర నారాయణ పురంలో కోడువానిబంద, కొత్తవలసలో రాయిబంద లను గుర్తించామని అన్నారు. వీటిపై కొంత మేర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని, తదుపరి నిర్మాణాలు చేపట్టకుండా రెవిన్యూ, పోలీస్ యంత్రాంగాలు నిఘా పెట్టాయని చెప్పారు. ఆక్రమణలకు ఎవరూ పాల్పడవద్దని, పట్టణ, భావితరాల భవిష్యత్తు దృష్ట్యా విశాల దృక్పథంతో ఆలోచించాలని ఆయన సూచించారు. ఆక్రమణదారులను గుర్తించామని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.  నీటి వసతులు భూగర్భ జలాల పెంపుకు, వరదల సమయంలో పట్టణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా నీటిని నింపుకునే గొప్ప వనరుగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. జిల్లా హెడ్ క్వార్టర్ మరింత అభివృద్ది చెందుతుందని అదే సమయంలో దాని రక్షణకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపనిచ్చారు. 


*ఆహ్లాదంగా నీటి వసతులు*


అన్ని విధాలా రక్షణ కవచంగా ఉపయోగపడే చెరువులను ఆహ్లాదంగా తయారు చేయుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. చెరువు గట్లపై వాకింగ్ ట్రాక్, విశ్రాంతి తీసుకొనుటకు బెంచీలు వంటివి ఏర్పాటు యోచన ఉందని ఆయన తెలిపారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image