స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ : పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన



*స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ : పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన*


*విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా  రేపు "బిజినెస్ సమ్మిట్"*


*ఆంధ్రప్రదేశ్ లో వన్ డిస్ట్రిక్ వన్ ప్రాడక్ట్స్ పై ఎగ్జిబిషన్*


*హాజరవనున్న భారత్ కు చెందిన జర్మనీ, నార్వే అంబాసిడర్లు*


అమరావతి, అక్టోబర్, 17 (ప్రజా అమరావతి): విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం  "బిజినిస్ సమ్మిట్" నిర్వహించనుందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన వెల్లడించారు. రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్‌ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. భారత్ కు చెందిన జర్మనీ రాయబారి పర్వతనేని హరీష్, నార్వే అంబాసిడర్ బి.బాల భాస్కర్  ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ మంగళగిరి కార్యాలయంలో వాణిజ్య సదస్సును ఏర్పాటు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.  ఆయా జిల్లాల్లో ప్రాముఖ్యత ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేసి వాటిని మేడిన్‌ ఆంధ్రా పేరుతో బ్రాండింగ్‌ కల్పించే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.  ఇప్పటికే మన రాష్ట్రంలో  జిల్లాల్లో సర్వే నిర్వహించి, విశేష ప్రాచుర్యం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల ప్రాముఖ్యాన్ని ప్రతిబింబించడంతో పాటు స్థానికులకు అత్యధికంగా ఉపాధి కల్పించే ఉత్పత్తులను ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన వెల్లడించారు.   హస్తకళలు, చేనేత, ఆహారం, వ్యవసాయం, ఖనిజాలు, బొమ్మల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ఉత్పత్తులను ఏపీఐఐసీ ఎక్స్ పీరియన్స్ రూమ్ లో ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం రాయబారులు, పారశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు,దిగుమతిదారులకు ఉత్పత్తులపై ఆమె ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.


అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి సాధించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంపైనా చర్చించనున్నట్లు ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు.


 ఉదయం 10 గం.లకు ప్రారంభం కానున్న బిజినెస్ సమ్మిట్ మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, చేనేత, జౌళి, పర్యాటక, ప్రణాళిక,వ్యవసాయం, ఆహారశుద్ధి, మత్స్య శాఖలు భాగస్వామ్యం అవనున్నాయి. సంబంధిత శాఖల కార్యదర్శులు కూడా ఒక జిల్లా ఒక ఉత్పత్తికి సంబంధించి వివరించనున్నారు. ఇప్పటికే బిజినెస్ సమ్మిట్ కోసం గీతేశ్ శర్మను ప్రత్యేక అధికారికంగా నియమించింది.   ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ జీ. సృజన, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఉద్యానవనం, ఆహారశుద్ధి, వ్యవసాయం, మత్స్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, పర్యాటక విభాగం అథారిటీ సీఈవో కె.కన్నబాబు, ఏపీఈడీబీ సీఈవో డాక్టర్ నారాయణ భరత్ గుప్తా సహా పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు పాల్గొననున్నారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image