గంగ యమున సరస్వతికి జీవం ఇచ్చిన కెజిబివి





గంగ యమున సరస్వతికి జీవం ఇచ్చిన కెజిబివి



రాష్ట్ర కెజిబివిల చరిత్రలో మొదటిసారి ఆరో తరగతిలోపు బాలికలకు అవకాశం 


జిల్లా కలెక్టర్ చొరవ, కృషితో ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర పథక సంచాలకులు 


మానవతా దృక్పదంతో ప్రత్యేక అనుమతులు ఇచ్చిన ఎస్పిడి సురేష్ కుమార్ 


నేటితో నెరవేరిన కెజిబివిల లక్ష్యం 

కెజిబివి పాఠశాలలో ఇంటర్ వరకు బాలికలకు చదువు 



విజయనగరం, అక్టోబర్ 22 (ప్రజా అమరావతి):

రాష్ట్ర కెజిబివి చరిత్రలో మొదటిసారి ఆరో తరగతిలోపు బాలికలకు కెజిబివి పాఠశాలలలో ఉండే అవకాశం దక్కింది. గంగ యమున సరస్వతి ముగ్గురు బాలికలకు జిల్లా సమగ్రశిక్షా తమ కెజిబివిలో చోటు కల్పిస్తూ జీవాన్ని ఇచ్చింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని ఆదుకుని భరోసా కల్పించింది. నేరుగా జిల్లా కలెక్టర్ ఎ సూర్యకుమారి చొరవతో రాష్ట్ర పథక అధికారి సురేష్ కుమార్ ప్రత్యేక అనుమతులతో నెల్లిమర్ల ముగ్గురు బాలికలకు కెజిబివిలో ఇంటర్ విద్య వరకు చదువుకునేందుకు అవకాశం కల్పించింది. అసలు విషయంలోకి వెళితే గత రెండు రోజులుగా నెల్లిమర్ల వద్ద గల ఆంజనేయస్వామి వారి ఆలయ సమీపంలో ఉన్న అనాధ బాలికల దినావస్త పరిస్థితి జిల్లా మొత్తం మారుమ్రోగిన విషయం అందరికి తెలిసినదే. వారి దుస్థితి చూసి సామాన్య ప్రజనీకానికే కాదు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మనసు కూడా చలించి వేసింది. అనాధ బాలికల వార్త బయటకు స్వచ్చంద సంస్థలు, ప్రజలు తమకు తోచిన సహాయం కూడా అందజేసారు. అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంటు వారు కూడా నేరుగా బాలికల ఇంటికి వెళ్ళి పరిస్థితిని గమనించారు. ఇక జిల్లా కలెక్టర్, సమగ్రశిక్షా చైర్ పర్సన్ కూడా బాలికలకు భరోసా కల్పించేందుకు తనవంతు కృషి చేసారు. ఇందుకోసం ఆమె స్వయంగా చొరవ తీసుకుని ముందడుగు వేసారు.  బాలికలకు ఇంటర్ విద్య వరకు అందించే లక్ష్యంతో చొరవ తీసుకున్నారు. వీరికి కెజిబివి పాఠశాలలో అవకాశం కల్పించేందుకు వెంటనే  జిల్లా సమగ్రశిక్షా అదనపు అధికారి డా. వేమలి స్వామినాయుడు ఆదేశాలు జారీ చేసారు. కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఎపిసి స్టేట్ కెజిబివి సెక్రటరీ జి. నాగమణి తో ఈ విషయమై మాట్లాడారు. ఈ సందర్భంగా బాలికల దుస్తుతిని ఎపిసి ఆమెకు క్షుణ్ణంగా వివరించారు. బాలికలలో మొదటి బాలిక గంగ 8వ తరగతి చదువుతుండగా, రెండో బాలిక యమున 4వ తరగతి, ఇక మూడవ బాలిక సరస్వతి 2వ తరగతి విద్యను అభ్యసిస్తున్నారని ఆమె వివరించారు. తల్లితండ్రులు లేని వారికి వారి నాన్నమ్మ వారికి పోషిస్తున్నదని ఇప్పుడు ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో బాలికల పరిస్థితి అద్వానంగా తయారైనదని కలెక్టర్ తెలియజేసారు. ఇదే విషయాన్ని స్టేట్ కెజిబివి సెక్రటరీ జి. నాగమణి రాష్ట్ర పథక సంచాలకులు సురేష్ కుమార్ వివరించడం జరిగింది.  విషయం తెలుసుకున్న ఎస్పిడి మానవతా దృక్పదంతో పరిస్థితిని అర్ధం చేసుకుని ముగ్గురు బాలికలకు కస్తురిభా గాంధీ బాలికా విద్యాలయలో వసతి కల్పించాలని ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. ముగ్గిరిలో పెద్ద బాలిక గంగకు మాత్రమే కెజిబివిలో 8వ తరగతిలో సీట్ కల్పిస్తూ మిగిలిన ఇద్దురు బాలికలకు కెజిబివిలో కేవలం వసతి కల్పిచాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో బాలికల భవిష్యత్ కు మార్గం సుమగం అయ్యింది. అలాగే ఈ సంఘటనతో కెజిబివి లక్ష్యం నెరవేరినట్లు అయ్యింది. రాష్ట్ర పథక సంచాలకులు అనుమతి మేరకు జిల్లా కలెక్టర్, సమగ్రశిక్షా చైర్ పర్సన్ ఎ. సూర్యకుమారి వెంటనే బాలికలను దగ్గరలో ఉన్న కెజిబివి చేర్చాలని జిల్లా సమగ్రశిక్షా పథక అధికారి డా. వేమలి స్వామినాయుడు కు ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు ఎపిసి వెంటనే ముగ్గురు బాలికలను కెజివిబి పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు చేపట్టారు. శనివారం అనగా అక్టోబర్ 22 మద్యాహ్నం జిల్లాలో నెల్లిమర్ల మండలంలో ఉన్న కెజిబివి పాఠశాలలకు ముగ్గురు బాలికలను స్వయంగా తీసుకువెళ్ళి పాఠశాలలో చేర్పించడం జరిగింది. 




Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image