ఆల్కాట్ గార్డెన్స్ లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం

 ఆల్కాట్ గార్డెన్స్ లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం



- పాత పైపు లైన్లు మార్చే పనిలో యంత్రాంగం ఉంది..


- మరణించిన ఆ ముగ్గురూ డయేరియా వల్లనే అని చెప్పలేం


- వైద్య బృందం సమగ్ర సర్వే చేస్తోంది..


- రాజమండ్రి ఎంపీ భరత్


రాజమండ్రి, అక్టోబరు 15 (ప్రజా అమరావతి): రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషను ఎదురుగా ఆల్కాట్ గార్డెన్స్ లో డయేరియా లక్షణాలతోనే మృతిచెందారని అనడానికి ఇంకా ఏమీ నిర్ధారణ కాలేదని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన నగరంలోని ఆల్కాట్ గార్డెన్స్ పరిధిలోని పలు వీధులను, పైపు లైన్ మరమ్మతు పనులను పరిశీలించారు. అక్కడ నుండి డయేరియా ప్రబలమైనట్టు ప్రచారం జరుగుతున్న పలు వార్డులలో ఎంపీ పర్యటించారు. ‌ఒకే రోజు ముగ్గురు మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ‌అక్కడ నుండి వినాయక వీధి నుండి అశోకా వీధి వరకూ గల ప్రాంతాన్ని, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అక్కడ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ‌ఆ శిబిరంలో ఒకే ఒక్క వ్యక్తి చికిత్స పొందుతుండటంతో అతని ఆరోగ్య పరిస్థితిని ఎంపీ భరత్ అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ మృతిచెందిన ముగ్గురూ డయేరియా తో కాదని తెలుస్తోందని చెప్పారు. ఏదేమైనా సరైన నిర్ధారణ జరిగే వరకూ కారణాలు ప్రకటించకూడదన్నారు. మంచినీరు సరఫరా అయ్యే  పాత పైపు లైన్లు లీకవ్వడం వల్ల నీరు కలుషితమైందని అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో వెంటనే ఆ కనెక్షన్స్ ను డమ్మీ చేసి, నీటి సరఫరా తాత్కాలికంగా మున్సిపల్ అధికారులు ఆపారని చెప్పారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోందన్నారు. మంచినీటి శాంపిల్స్ పరీక్ష నిమిత్తం కాకినాడ ల్యాబ్స్ కు, జేఎన్టీయూకి పంపారని తెలిపారు. గతంలో రోడ్ల విస్తీర్ణంలో పైపు లైన్లు బహుశా చిట్లి ఉండవచ్చునని, త్వరలో ఇక్కడ రహదారి 60 అడుగుల నుండి 80 అడుగులకు వెడల్పు చేసే ప్రతిపాదన ఉందని, గోదావరి బండ్ నుండి రూ.2 కోట్లతో కొత్త పైపు లైన్లు కూడా ఏర్పాటు చేస్తామని ఎంపీ భరత్ తెలిపారు. టెండర్స్ పిలుస్తామని చెప్పారు. ప్రస్తుతం వాతావరణ మార్పు మూలంగా వచ్చే సీజనల్ వ్యాధులకు అశ్రద్ధ చేయకుండా ప్రత్యేక వైద్య శిబిరంలో వైద్యులచే పరీక్షలు చేయించుకోవలసిందిగా ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో 118 మంది పరీక్షలు చేయించుకున్నట్టు వైద్యులు చెప్పారన్నారు. ప్రస్తుతం ఆల్కాట్ గార్డెన్స్ లో ఆరోగ్యకర వాతావరణం నెలకొందని, పూర్తి స్థాయిలో రక్షిత మంచినీటిని సరఫరా చేసి, ప్రజల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించేలా చేసే రైతులకు సర్టిఫికేషన్
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image