ఒకరేమో మీ భూమి లాక్కుంటే ఇంకొకరు తన వద్ద ఉన్న భూమి మీకు అప్పగిస్తున్నారు


అవనిగడ్డ, కృష్ణా జిల్లా (ప్రజా అమరావతి);


*సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కృష్ణా జిల్లా అవనిగడ్డ పర్యటన*


*22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం, షరతు గల పట్టా భూములు తొలగింపు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్‌ పత్రాలు*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, నిజానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం శ్రీ జగన్‌ గారికి వారి కుటుంబానికి కొత్తేమీ కాదు. గడిచిన కాలంలో మన సీఎంగారి తండ్రి సుమారు 7 లక్షల ఎకరాల భూమిని 2004 నుండి 2009 వరకు పంపిణీ చేశారు. మళ్ళీ ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఈ 35 వేల ఎకరాలు గడిచిన ప్రభుత్వం ప్రభుత్వ భూమి అని పెట్టింది. 2016లో ఉన్న టీడీపీ ప్రభుత్వం చేసిన పని, కానీ ఇది ప్రభుత్వ భూమి కాదు, సుమారుగా 90 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే ఈ భూమి అని ఈ సీఎంగారు ఆర్డర్స్‌ ఇచ్చారు. ఇద్దరికీ తేడా చూడండి. ఒకరేమో మీ భూమి లాక్కుంటే ఇంకొకరు తన వద్ద ఉన్న భూమి మీకు అప్పగిస్తున్నారు


, దీనిని బట్టి ఎవరు రైతాంగం వెంట ఉన్నారో అర్ధం చేసుకోండి. ఈ పని చేయాలంటే పెద్ద హృదయం ఉండాలి, ఈ భూమి విషయం మీ ఎమ్మెల్యే సీఎంగారి దృష్టికి తీసుకెళితే సీఎంగారు టేబుల్‌ మీదే డెసిషన్‌ తీసుకున్నారు. రైతాంగానికి సర్వ హక్కులు ఇచ్చేద్దామన్నారు. ఇది శ్రీ జగన్‌ గారి ఫిలాసఫి. ఇది ఒక్క ఈ ప్రాంతానికి సంబంధించిందే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు తరతరాలుగా సాగుచేసుకున్న రైతులకు వెళ్ళాలనే ఫిలాసఫి సీఎంగారిది. భూమి అనేది ఒక సెంటిమెంట్, హక్కులు లేకపోతే మానసికంగా కృంగిపోతారు, అమ్ముకునే హక్కు లేదంటే కుంగిపోతారు. భూమి సమాజంలో హోదానిస్తుంది, అలాంటి హోదా సీఎంగారి వల్ల ఈ రైతులకు వచ్చింది. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తున్నాం, ఎప్పుడైనా ఒక పేదవాడు హక్కులు కలిగిన భూమిపై తాను సులువుగా రుజువు చేసుకోలేకపోతే ధనవంతులకు దఖలు పడే ప్రమాదం ఉంది. సమగ్ర సర్వే జరగబోతుంది, వందేళ్ళ తర్వాత చేస్తున్నాం, గతంలో ఎవరూ చేయలేదు, బీదలకు వారి హక్కులు కల్పించాలనే ప్రభుత్వం ఇది, సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తులు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ ప్రభుత్వం ఆ పని చేస్తుంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాం, అవినీతిని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీ ఒక మాట అన్నారు, వంద రూపాయిలు ఢిల్లీలో విడుదల చేస్తే చివరికి పేదవాడికి రూ. పది మాత్రమే అందుతున్నాయని బాధపడ్డారు. ఈ మూడేళ్ళలో ఈ ప్రభుత్వం నయా పైసా లంచం చెల్లించకుండా వేల కోట్లు పంపిణీ జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుగుతుంది. బీదలు ఆత్మాభిమానం చంపుకుని ఇతరులపై ఆధారపడి సంక్షేమ కార్యక్రమాలు అందుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా, ఇది కాదా మార్పు. ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలి, దొంగలు అనేక పద్దతుల్లో వస్తారు, మన మనసు చెడగొట్టే పని చేస్తారు, ప్రజలు ఆలోచించాలి, మన కోసం ఎవరున్నారు అని ఆలోచించిన రోజే ఇలాంటి మంచి ప్రభుత్వాలు వస్తాయి, రాబోయే కాలంలో మీరంతా శభాష్‌ అనే విధంగా రెవెన్యూ వ్యవస్ధలో మార్పులు తీసుకొస్తాం. ధన్యవాదాలు. 


*కొండవీటి వీర వెంకట నారాయణరావు, రైతు, విశ్వనాధపల్లి, కోడూరు మండలం*


అందరికీ నమస్కారం, మా ప్రాంత రైతులకు ఇది పండుగ కార్యక్రమం, నేను 30 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను, నేను ఇల్లు కట్టుకోవడానికి 2009లో లోన్‌ తీసుకుని కట్టాను, నా కుమార్తె వివాహం సందర్భంగా 2017లో బ్యాంకులో లోన్‌ కోసం వెళితే నీ భూమి నిషేదిత జాబితాలో ఉంది, లోన్‌ రాదన్నారు, ఇది ప్రభుత్వ భూమి అనడంతో కంగుతిన్నాం, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ సహాయం చేయలేదు. మీరు రాగానే మా సమస్యను మీ దృష్టికి తీసుకురావడంతో మీరు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు, మేం అనిశ్చిత స్ధితినుండి మేం భూమి యజమానులం, అందరు రైతుల్లాగానే మాకు అన్ని హక్కులు కల్పించారు, మా కుటుంబంలో మూడెకరాల భూమి నిషేదిత జాబితాలో ఉన్నది ఇప్పుడు తొలగిస్తున్నారు, మా రైతులందరి దీవెనలు మీకుంటాయి, మీరు పదికాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము, ధ్యాంక్యూ.


*రేపల్లె రాజయ్య, రైతు, వి. కొత్తపాలెం, కోడూరు మండలం*


మా ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన భూమిని నా మనవళ్ళకు రిజిస్టర్‌ చేద్దామని రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కి వెళితే ఇది నీ భూమి కాదన్నారు, అధికారుల చుట్టూ తిరిగాం, నిరాహారదీక్షలు చేశాం, కానీ నాటి ప్రభుత్వం స్పందించలేదు. కానీ మన సీఎంగారు వచ్చిన తర్వాత నా ఐదెకరాల భూమి నాకు హక్కులు వచ్చేలా చేస్తున్నారు, ధన్యవాదాలు. అనేక పథకాలు నేను అందుకుంటున్నాను. మా మనవళ్ళు ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు, వారికి అన్నీ అందుతున్నాయి, డ్వాక్రా ద్వారా వచ్చిన డబ్బుతో గేదెలు కొనుక్కున్నాం, నా కోడళ్ళకి కూడా అన్నీ అందాయి. నేను 70 ఏళ్ళ వయసులో కూడా సంతోషంగా వ్యవసాయం చేస్తున్నాను, నమస్కారం.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image