నవెంబర్ లో జగనన్న క్రీడా సంబరాలు collector మాధవీలత

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


నవెంబర్ లో జగనన్న క్రీడా సంబరాలు collector మాధవీలత



బుధవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో గోడ ప్రతి ఆవిష్కరణ



 నవంబరులో జిల్లాలో జగనన్న క్రిడా సంబరాలు ఘనంగా నిర్వహించే దిశలో జిల్లా క్రీడా సాధికారిత సంస్థ ద్వారా  నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు.





బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లో జగనన్న క్రీడా సంబరాల గోడ ప్రతిని ను కలెక్టర్ ఆవిష్కరించారు. క్రీడా సంబరాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అధికారులకు పిలుపు నిచ్చార్యు. అనంతరం జిల్లా క్రీడల చీఫ్‌ కోచ్‌ శేషగిరి రావు క్రీడా సంబరాల వివరాలను తెలిపారు. కబడ్డీ (మహిళలు, పురుషులు), వాలీ బాల్‌ (మహిళలు, పురుషులు), క్రికెట్‌ (పురుషులు), బాడ్మిం టన్‌ (సింగిల్‌, డబుల్‌) అంశాల్లో పోటీలు నిర్వహించేం దుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిం దన్నారు. 2022 డిసెంబరు 31 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుని, జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌లో సభ్యత్వం కలిగిన అభ్యర్థులు ఈ క్రీడా సంబరాల్లో పాల్గొనేందుకు అర్హుల న్నారు. బాడ్మింటన్‌ సింగిల్స్‌లో పాల్గొనే క్రీడాకా రులు రూ.200, డబుల్స్‌లో పాల్గొనే క్రీడా కారులు రూ.300 ప్రవేశ రుసుం చెల్లించాలన్నారు. క్రీడాకారులు తమ ఆధార్‌, జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌ గుర్తింపు కార్డుల ధ్రువీకరణకు ఇవ్వాలని సూచించారు.


నాలుగు దశల్లో క్రీడా సంబరాలు

క్రీడా సంబరాలు నాలుగు దశలలో నిర్వహించను న్నారు. మొదటి దశను నియోజక వర్గం స్థాయిలో నవంబరు 10లోగా, రెండవ దశలో జిల్లా స్థాయిలో నవంబరు 20 నుండి 25లోగా నిర్వహిస్తారు. మూడవ దశ జోనల్‌ స్థాయిలో డిసెంబరు 10లోగా పూర్తి చేసి రాష్ట్ర స్థాయి పోటీలను డిసెంబరు 20, 21 తేదీల్లో నిర్వహించుటకు చర్యలు చేపట్టారు. జోనల్‌ స్థాయిలో వాలీబాల్‌ శ్రీకాకుళంలో, కబడ్డీ విశాఖల, క్రికెట్‌, బాడ్మింటన్‌ విజయనగరంలో నిర్వహి స్తారు. క్రీడలను నాక్‌ అవుట్‌ పద్దతిలో నిర్వహిస్తారు.

మొదటి బహుమతి రూ.5 లక్షలు

జగనన్న క్రీడా సంబరాల్లో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన బందాలకు భారీ నగదు బహుమతులను క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించింది. కబడ్డీ (మహిళలు, పురుషులు) మొదటి స్థానానికి రూ.5 లక్షలు, రెండవ స్థానానికి రూ.3 లక్షలు, సెమీ ఫైనల్స్‌ లో ఓడిన జట్లకు లక్ష రూపాయలు చొప్పున., వాలీ బాల్‌ (మహిళలు, పురుషులు)లి మొదటి స్థానానికి రూ.3 లక్షలు, రెండవ స్థానానికి రూ.2.50 లక్షలు, సెమీ ఫైనల్స్‌లో ఓడిన బందాలకు రూ.50 వేలు చొప్పున, క్రికెట్‌ (పురుషులు) మొదటి స్థానానికి రూ.5 లక్షలు, రెండో స్థానానికి రూ.3 లక్షలు, సెమీ ఫైనల్స్‌లో ఓడిన బందాలకు లక్ష రూపాయలు చొప్పున., బాడ్మింటన్‌ (సింగిల్‌) మొదటి స్థానానికి లక్ష రూపాయలు, రెండవ స్థానానికి రూ.50 వేలు, సెమీ ఫైనల్స్‌ లో ఓడిన అభ్యర్థులకు రూ.25 వేలు చొప్పున., బాడ్మింటన్‌ (డబుల్‌) మొదటి స్థానానికి లక్ష రూపాయలు, రెండవ స్థానానికి రూ.50 వేలు, సెమీ ఫైనల్స్‌ లో ఓడిన అభ్యర్థులకు రూ.25 వేలు చొప్పున బహుమతులు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా  క్రిడాధి కారులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image