మార్చి3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్ -2023

 *మార్చి3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్ -2023


*రాష్ట్ర పరిశ్రమల  శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్*

                                                                                                                                                                                          అమరావతి, నవంబరు 8 (ప్రజా అమరావతి):   వచ్చే ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023  *(AP GLOBAL INVESTORS SUMMIT-2023)* ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.   ఈ సమ్మిట్ కు సంబంధించి   దేశంలోని పలు ప్రముఖమైన నగరాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో యు.ఎస్.ఏ., యూ.కె., జర్మనీ, ఇజ్రాయిల్, తైవాన్, దక్షిణ కొరియా తదితర ప్రధాన  దేశాల్లో రోడ్ షోలను నిర్వహించేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రానికి  బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పటికీ, వారి సూచనల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా పలు పరిశ్రమలను నడుపుతున్న వారినే ఈ సమ్మిట్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉపయోగించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. 


మంగళవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  ఈ ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని, దాని లోగోను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించడం జరిగిందన్నారు. గత మూడేళ్ల కాలంలో రెండేళ్లు కోవిడ్ విపత్తు వల్ల  దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఎటు వంటి సదస్సులను, సమావేశాలను నిర్వహించ లేకపోవడం జరిగిందని, ఆ విపత్తు నుండి కోలుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలు పెట్టుబడిదారుల సదస్సులను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. నవంబరు 2 నుండి 4 వరకూ కర్ణాటకలోని బెంగుళూరులో  ఈ సదస్సు జరిగిందని, వచ్చే రోజుల్లో ఒడిస్సా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఇటు వంటి సదస్సులను నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాయన్నారు. 


రాష్ట్రంలో అందుబాటులోనున్న వనరులకు అనుగుణంగా ముఖ్యంగా విద్య, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్ ఉత్పత్తులు, డిఫెన్సు ఎయిరో స్పేస్,  ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ వెహికిల్స్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, పర్యాటకం మరియు ఆతిధ్యం తదితర రంగాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మారీటైం, లాజిస్టిక్స్ ఎక్స్ పోర్ట్సు, ఇండస్ట్రియల్ కారిడార్స్ మరియు ఇన్నోవేషన్స్ అండ్ స్టార్టప్స్   రంగాలకు ఈ సదస్సులో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 


 రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎం.ఎస్.ఎం.ఇ.ల ప్రోత్సాహానికి, బలోపేతానికి మరియు మరిన్ని ఎం.ఎస్.ఎం.ఇ.ల స్థాపనకు ఈ సదస్సులో అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో దేశానికే కాకుండా  ప్రపంచానికే మన  రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.  అప్పేరల్ ఇండస్ట్రీలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని,  పది వేల మందికి ఉపాధి కల్పించే అపాచీ ఫుట్ వేర్ సంస్థకు రెండు మాసాల క్రితం తిరుపతిలో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 


 విశాఖ- కాకినాడ  పి.సి.పి.ఐ.ఆర్. కారిడార్ దేశంలోనే అతిపెద్ద కారిడార్ అని, 640 స్కేర్  కి.మి. పొడవైన  ఈ కారిడార్ లో పెట్రోకెమికల్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను ఈ మద్యనే ఢిల్లీలో జరిగిన ఇండియా కెం సదస్సులో వివరించడం జరిగిందని, అదే విధంగా ఈ సదస్సులో కూడా  పెట్రోకెమికల్స్ పరిశ్రమల స్థాపనకు  అత్యధిక ప్రాధాన్యత నివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. 


 దేశంలోని పారిశ్రామిక అభివృద్దికి, ఎగుమతులకు తూర్పు తీరాన ఒక గేట్ వే గా మన రాష్ట్రంలోని పోర్టులను పెద్ద ఎత్తున అభివృద్ది పర్చి తద్వారా దేశ, రాష్ట్ర ఆర్థిక పురోగతిలో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో పది పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని రాష్ట్రంలో చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన  రామాయపట్నం  పోర్టు నిర్మాణ పనులు, భావనపాడు భూ సేకరణ పనులు కూడా వేగవంతంగా జరుగుచున్నాయన్నారు. బందరు పోర్టుకు సంబందించి కోర్టు కేసులు అన్నీ తొలగిపోయాయని, దానికి కూడా త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.  రామాయపట్నం పోర్టుకి మొదటి షిప్ ను 2023 డిశంబరు నాటికి తీసుకు రావాలన్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నిర్థేశించారని, ఆ లక్ష్య సాధనకు కృషి చేయడం జరుగుచున్నదని, అలా కాని పక్షంలో  కనీసం 2024 సంవత్సరం జనవరి నాటికన్నా తొలి షిప్ ను  రామాయపట్నం పోర్టుకి తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 


తొలిదశలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం  చేపట్టడం జరిగిందని, మిగతా  ఐదు ఫిషింగ్  హార్బర్ల నిర్మాణ పనులను కూడా త్వరలోనే చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు . వచ్చే ఏడాది జనవరి కల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను  ప్రారంభించే విధంగా పనులు జరుగుచున్నాయన్నారు. 


ఇటు వంటి కీలక పరిస్థితుల్లో  సి.ఐ.ఐ. నేతృత్వంలో ఈ వచ్చే ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్ – 2023 ను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని,  ఈ సదస్సును వేదికగా చేసుకొని దేశ, విదేశాల్లోని  పెద్ద పెద్ద  పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి ఆహ్వనించేందుకు ప్రభుత్వం చర్యలను తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.   రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన జరిగితే రాష్ట్రం ఆర్థికంగా మరింత బలోపేతంగా మారడమేకాకుండా  నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు.  కాకినాడ  ప్రాంతంలో భారీ స్థాయిలో బల్క్  డ్రగ్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, దీని కోసం దేశంలోని  పలు రాష్ట్రాలు పోటీపడినప్పటికీ,  కేవలం మన రాష్ట్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు మాత్రమే దక్కించుకోగలిగాయన్నారు.  ఇందుకు మనం అనుసరించే పారిశ్రామిక విధానమే ప్రధాన  కారణమన్నారు.   ఈ బల్క్ డ్రగ్ పార్కు ద్వారా దాదాపు రూ.40 వేల కోట్ల మేర పెట్టుబడులు  రాష్ట్రానికి  వచ్చే అవకాశం ఉందని, అదే విధంగా  25 వేల మందికి ప్రత్యక్షంగా మరో  ఇరవై వేల మందికి పరోక్షంగా  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లు మంత్రి తెలిపారు.  దావోస్ సదస్సు కు  రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా హాజరయ్యారని,   ఈ సదస్సులో  రెన్యువబుల్ ఎనర్జీకి సంబందించి రూ.1.25 వేల కోట్ల  విలువైన 25 ఎం.ఓ.యు. లను చేసుకోవడం జరిగిందన్నారు.   ఈ ఒప్పందాల్లో ఇప్పటికే రూ.40 వేల కోట్ల  విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నట్లు మంత్రి తెలిపారు.  


పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెపుతూ గత ప్రభుత్వం  మూడు సార్లు సదస్సులను నిర్వహించి  రూ. 16 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నట్లు చెప్పడం జరిగిందని, అయితే   నిజానికి   రూ.30 నుండి 35 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు రాష్ట్రానికి  రావడం జరిగిందన్నారు.  తమ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించదని,  నిజానికి పెట్టుబడులు వచ్చే ఒప్పందాలను మాత్రమే ఈ సదస్సులో చేసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టంచేశారు. 


రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్‌ షన్‌మోహన్, ఏపీఎంఎస్‌ఎంఈ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్‌ కె రవిచంద్రారెడ్డి, పరిశ్రమలుశాఖ సలహాదారు ఎల్‌ శ్రీధర్, ఏపీఐడీసీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్‌ ఎస్‌ నీరజ్, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు అప్పికట్ల వల్లబాయి  పటేల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image