నేడు డిగ్రీలు పొందిన విద్యార్థులు దేశ సేవలో భాగస్వాములు కావాలి: రాష్ట్ర గవర్నర్



*నేడు డిగ్రీలు పొందిన విద్యార్థులు దేశ సేవలో భాగస్వాములు కావాలి: రాష్ట్ర గవర్నర్



తిరుపతి, నవంబర్ 11 (ప్రజా అమరావతి): భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలో రెండవ అతి పెద్దదిగా ఉందని అత్యాధునిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడం మన లక్ష్యం కావాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయ కులపతి మరియు రాష్ట్ర గవర్నర్ గౌ.బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం మద్యాహ్నం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ 19 మరియు 20 వ స్నాతకోత్సవం మహిళా విశ్వవిద్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. 


రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణoగా ఉన్నత విద్యాసంస్థలు మెరుగైన విద్యా విజ్ఞానాన్ని అందించడానికి  కృషి చేయాలని అన్నారు. పాఠ్య మరియు పరిశోదనలు నిరంతరం జరగాలని అప్పుడే సమర్థవంతమైన ఉన్నత విద్య రాణించగలుగుతుందని అన్నారు.  ఉమ్మడి బోధన, వర్చువల్ లర్నింగ్, ఉపన్యాసాలు ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవాలని అద్యాపకులు కొత్త పద్దతులలో భోదనలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా విద్యార్థులను దేశ నిర్మాణ కర్తలుగా  శిక్షణ ఇవ్వాలనే స్థాపించిన ఈ విశ్వ విద్యాలయం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఉందని అన్నారు. ఎన్.ఈ.పి. – 2020 విద్యార్థులలో సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి, వంద శాతం బాలికలు పాఠశాలల్లో నమోదుకు అవకాశం వంటి చట్టాలు ఉన్నాయని అన్నారు. ఈ విశ్వవిద్యాలయం భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో 24 వ స్థానంలో నిలిచినందుకు 2021-22 ఫార్మసీ విభాగంలో 42 వ ర్యాంకును సాదించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయం నుండి 6 వేలకు మందికి పైగా విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలలో ఉన్నారనడానికి గర్వకారణంగా ఉందని అన్నారు. నేడు డిగ్రీ పట్టాలు అందుకున్న వారికి నా శుభాకాంక్షలని ఉన్నత విద్యను అభ్యసించి బాహ్య ప్రపంచంలోకి వెళుతున్న మీరు దేశ సేవలో స్వాతంత్ర్య సమారయోధుల స్ఫూర్తితో భాగస్వాములు కావాలని కోరుతున్నానని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సమయంలో స్వాతంత్ర్య సమారయోధులను స్మరించుకోవాలని అన్నారు. గౌ.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని అన్నారు.  


గౌ.డాక్టరేట్ అందుకున్న డా.పద్మాజా రెడ్డి మాట్లాడుతూ నా స్వస్థలం కూచిపూడి గ్రామమని, 6 సంవత్సరాల వయస్సు లోనే కూచిపూడి నేర్చుకుని 50 సంవత్సరాలుగా వంద దేశాలు పైగా 3000 కార్యక్రమాలు చేపట్టానని, ప్రణవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ సంస్థ ద్వారా వేలాదిమందికి నాట్యంలో శిక్షణ అందించానని నేడు గౌ.డాక్టరేట్ అందుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. శాస్త్రీయ నాట్య రంగంలో పట్టుదలతో ఎన్నో సవాళ్ళను అధిగమించి జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించిందని అన్నారు. విద్యార్థులు అంతే పట్టుదలతో సమాజంలో, సమాజ సేవలో రాణించాలని కోరుకుంటున్నానని, నేడు పట్టాలు అందుకున్న వారికి శుభాకంక్షలని అన్నారు.  


వైస్ చాన్సలర్ డి.జమున మాట్లాడుతూ శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం దేశంలోనే ఆదర్శంగా నిలిచి విద్యా భోదన, పరిశోదనలు నిర్వహిస్తున్నామని ఎంతో మంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని అన్నారు. వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలతో బాగస్వాములై విద్య, విజ్ఞానంలో పురోగతిలో ఉన్నామని 27 డిపార్ట్మెంట్ లు, 34 యు.జి., పి.జి. కోర్సులు నిర్వహిస్తున్నామని వివరించారు.   


నేడు గౌ. డాక్టరేట్  అందుకుంటున్న పద్మశ్రీ జి.పద్మజా రెడ్డి, పి.హెచ్.డి. లు 71 మంది, ఎం.ఫిల్3, 1902 మంది వివిధ కోర్సులలో పట్టాలు అందుకున్న  వీరిలో అత్యున్నత ప్రతిభ కనబరిచి మెడల్స్ , బుక్ ప్రైజ్ లు, క్యాష్ ప్రైజ్ లు అందుకున్న 108 మందికి గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 


స్నాతకోత్సవం ప్రారంభ సమయంలో  వైస్ చాన్సెలర్ డి.జమున, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, అద్యాపకులు, రాష్ట్ర గవర్నర్ కు కులపతి హోదాలో స్వాగతం పలికారు.  స్నాతకోత్సవ ప్రొసీజర్ ప్రారంభించి రాష్ట్ర గవర్నర్   నేటి గౌరవ అతిధి పద్మశ్రీ పద్మజా రెడ్డి కి గౌరవ డాక్టరేట్ ను అందించారు.పి.హెచ్.డి.లు ఎం.ఫిల్ లు, యు.జి., పీ.జి. డిగ్రీలు అందుకున్న వారితో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. 


ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్ పి సిసోడియా,  డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు,  విశ్వ విద్యాలయ అద్యాపకులు పాల్గొన్నారు. 



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image