జాతీయస్థాయిలో నెల్లూరు జిల్లా కీర్తి ప్రతిష్టలు రెపరెపలాడేలా జిల్లాలోని విద్యార్థులందరూ యువజన ఉత్సవాల్లో తమ సత్తా చాటాలి



నెల్లూరు, నవంబర్ 19 (ప్రజా అమరావతి): జాతీయస్థాయిలో నెల్లూరు జిల్లా కీర్తి ప్రతిష్టలు రెపరెపలాడేలా జిల్లాలోని విద్యార్థులందరూ యువజన ఉత్సవాల్లో తమ సత్తా చాటాల


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

 శనివారం ఉదయం నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ కళాక్షేత్రంలో యువజన సర్వీసుల శాఖ, సెట్నల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాధ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ భావి భారత నిర్దేశకులు యువతేనని, ఆ దిశగా యువశక్తి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వారసత్వం అంటే తల్లిదండ్రులు మనకు ఇచ్చిన ఇంటి పేరు కాదని, మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించడమే నిజమైన వారసత్వమని మంత్రి చెప్పారు. జిల్లా స్థాయిలో నిర్వహించే అన్ని పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయస్థాయి యువజన ఉత్సవాల్లో నెల్లూరు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. 

 జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని రాణించాలని ఆమె ఆకాంక్షించారు. 

 ముందుగా సెట్నల్ సీఈవో శ్రీ పుల్లయ్య యువజన ఉత్సవాల్లో భాగంగా  జానపద గీతాలు, నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, హిందుస్థాని, వీణ, సితార, మృదంగం, ఫ్లూట్, గిటార్ మొదలైన అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో విజేతలైన వారు రాష్ట్రస్థాయి పోటీలకు, రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారు వచ్చే సంవత్సరం జనవరిలో నిర్వహించే జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. 

తొలుత యువజన ఉత్సవాలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. 

 అనంతరం వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. 

 ఈ కార్యక్రమంలో డిఆర్వో వెంకటనారాయణమ్మ, సెట్నల్ సీఈవో పుల్లయ్య, జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి, సమాచార శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image