జయ బోండాలకు భలే గిరాకీ...

 జయ బోండాలకు భలే గిరాకీ...


సరఫరా చేయాలని ఏపిని కోరిన కేరళ సర్కార్..

రెండు ప్రభుత్వాల మధ్య ఎంఒయు

తిరువనంతపురం, నవంబర్ 1 (ప్రజా అమరావతి):   ఆంధ్రప్రదేశ్ లో రైతులు పండించే జయబోండాలు ధాన్యం రకానికి కేరళలో డిమాండ్ బాగానే ఉంది. కేరళ ప్రభుత్వం ఈ రకం ధాన్యాన్ని సరఫరా చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాల మధ్య మంగళవారం నాడు అవగాహన ఒప్పందం కుదిరింది. ఇటీవల ఏపి పర్యటనకు వచ్చిన కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి అనిల్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థను పరిశీలించారు. బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసరాలను ప్రత్యేక వాహనాల్లో లబ్ది దారుల ఇళ్లకు ఏపి ప్రభుత్వం సరఫరా చేస్తున్న విధానాన్ని చూసి మెచ్చుకున్నారు.అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని రకాల నిత్యావసరాలను పరస్పరం సరఫరా చేసుకోవడం అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును కేరళ పర్యటనకు ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో మంత్రి కారుమూరి, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్ , ఏపి డెయిరీ ఎండీ అహ్మద్ బాబు ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందం కేరళలో పర్యటించింది. ఇరు రాష్ట్రాల మంత్రులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం నాడు జరిగిన సమావేశంలో కొన్ని కీలకాంశాలపై చర్చించారు.ప్రధానంగా ఏపిలో పండే జయ రకం ధాన్యానికి తమ వద్ద బాగా డిమాండ్ ఉంటుందని , తమ అవసరాలకు సరిపడ సరఫరా చేయాలని కేరళ మంత్రి అనిల్ ఏపి మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కోరారు.జయ బోండాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అందించాలన్నారు. మంత్రి అనిల్ విజ్ఞప్తి మేరకు మంత్రి కారుమూరి సంసిద్ధత వ్యక్తం చేశారు. ధాన్యం తో పాటు ఏపి మార్క్ ఫెడ్ ద్వారా కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు తదితర నిత్యావసరాలను కూడా సరఫరా చేయాలని కోరారు.దీనిపై మంత్రి కారుమూరి సానుకూలంగా స్పందించారు. ప్రజలకు మేలు చేసేందుకు తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న చర్యలను వారికి వివరించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనం కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో 

రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపి మార్క్ ఫెడ్ సరఫరా చేసే నిత్యావసరాలను తమ రాష్ర్టంలోని కేరళ పౌరసరఫరాల సంస్థ (సప్లైకో) కు చెందిన మావెల్లి స్టోర్స్ ద్వారా వినియోగదారులకు అందించనుంది.కేరళ ప్రభుత్వం తో కుదిరిన ఈ ఒప్పందంతో ఏపి లోని జయబోండాలు పండించే రైతులకు మద్దతు ధర లభించి పెద్ద ఎత్తున మేలు జరుగనుంది. అంతే గాక రెండు రాష్ర్టాల ప్రయోజనాల కోసం పరస్పర సహాయ సహకారాలు అందించుకునేదుకు వీలుంటుంది.

మా వెల్లి స్టోర్స్ ను సందర్శించిన మంత్రి కారుమూరి

రెండు రాష్ర్టాల మధ్య నిత్యావసరాల సరఫరా అవగాహన ఒప్పందం అనంతరం కేరళ మంత్రి అనిల్, ఆ రాష్ర్ట ఉన్నతాధికారులతో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అధికారుల బృందం మావెల్లి స్టోర్స్ ను సందర్శించింది. స్టోర్స్ ద్వారా వినియోగదారులకు నిత్యావసరాల సరఫరాను పరిశీలించారు.ఏపిలో పండే మిర్చి, కంది, మినుము,శనగ, ధనియాలను మార్క్ ఫెడ్ ద్వారా  మార్క్ ఫెడ్ బ్రాండ్ పేరు తో అక్కడి స్టోర్స్ కు అందిస్తామని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image