రొయ్యల సేద్యంపై మంత్రుల కన్ను పడటంతోనే ధర పడిపోయింది


 

మాజీ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ 


*రొయ్యల సేద్యంపై మంత్రుల కన్ను పడటంతోనే ధర పడిపోయింది*

*ఆక్వా రైతుల బతుకులను సజ్జల, అప్పలరాజు, బొత్స రివర్స్ చేశారు*

*మొన్న కేజి ధర రూ.240 గా నిర్ణయించి నిన్న రూ.210 అని చెబుతున్నారు*

*మంత్రుల కమిటీ ఏర్పాటయ్యాక ఆక్వా రైతులు పంట విరామం ప్రకటించే పరిస్థితి వచ్చింది*

*టమాట రైతులు కేజీ 50 పైసలకు అమ్ముకుంటుంటే పట్టించుకోవట్లేదుః సోమిరెడ్డి*

మంగళగిరి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో రొయ్యల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సేద్యం కుదేలైంది. జగన్ రెడ్డి ఆక్వా కల్చర్ పై కొత్త చట్టాలు తీసుకురాక ముందు పరిస్థితి బాగుంది. అక్టోబర్ 17 న సజ్జల, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు లు కలిసి రొయ్యలకు రేట్లు నిర్ణయించారు. నాటి నుంచి రొయ్యల రైతుల పరిస్థితి రివర్స్ అయింది. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ యాక్ట్ (యాక్ట్ ఆఫ్ 29/2020), సీడ్ యాక్ట్ నం.36/2020 లను తీసుకొచ్చారు. రొయ్యల పండించే రైతులపై, సీడ్ తయారుచేసే హేచరీలపై, ఫీడ్ తయారుచేసే పరిశ్రమలపై, ప్రాసెసింగ్ యూనిట్లపై, ఎగుమతులు చేసే కంపెనీలపై చట్టం తీసుకొచ్చి తమ చేతుల్లో పెట్టుకోవాలని చూశారు. దీని కారణంగా రొయ్యల రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూస్తున్నారు. రొయ్యల రైతులు విజయవాడలో సమావేశమై మేం క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రెండు నెలల క్రితం ప్రకటించారు. అయినా పట్టించుకోలేదు. అక్టోబర్ 17 న వంద కౌంట్ మార్కెట్ లో రూ.220 ఉంటే మంత్రుల కమిటీ రూ.240 మద్దతు ధర ప్రకటించింది. అప్పటి నుంచి వంద కౌంట్ మార్కెట్ లో రూ.190 కి పడిపోయింది.

మరలా ఈరోజు మద్దతు ధర కుదింపు చేసి రూ.210 కి కొని తీరాలని మంత్రిగారు సెలవిస్తున్నారు. చట్టం తీసుకొచ్చి, మంత్రులు, సలహాదారులు మీటింగ్ పెట్టిన తర్వాత రొయ్యల ధర రూ.190 కి పడిపోతే ఏం చేశారు? చట్టం దేనికి తీసుకొచ్చారు.? మీరు ఇందులో ప్రమేయం చేసుకోవాల్సి అవసరం ఏమొచ్చింది? మార్కెట్ లో కిలో సోయాబీన్ ధర రూ.50 నుంచి రూ.90 కి పెరిగిందని టన్ను ఫీడ్ ధర రూ.65,000 నుంచి రూ.85000 కు పెంచారు. నేడు అదే సోయాబీన్ ధర రూ.90 నుంచి రూ.50కి పడిపోయినా రొయ్యల ఫీడ్ కాస్ట్ మాత్రం ఎందుకు తగ్గడం లేదు? ఫీడ్ పరిశ్రమల నుంచి కేజీకి రూ.5 లెక్కన టన్నుకు రూ.5000 వసూళ్లు మొదలుపెట్టారు. అందుకే సోయాబీన్ ధర తగ్గినా ఫీడ్ రేటు తగ్గడం లేదు.

పరిస్థితి ఇలా ఉంటే మీరు చేసే చట్టాలు ఎందుకు? మొత్తం వ్యవసాయం చేసే రైతుల నుంచి హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లపై చట్టం తెచ్చి ఉపయోగం ఏంటి? మార్కెట్ లో రొయ్యలు కొనే వాళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఇటీవల గోదావరి జిల్లాలో ఒక రైతు నా రొయ్యలు కొనేవాళ్లు లేరంటూ గ్రామంలో పంచిపెట్టిన దృశ్యాలు చూస్తుంటే రొయ్యల రైతుకు ఎంత కష్టం వచ్చిందో అర్ధమౌతుంది. 

నిల్వ చేయడానికి ఇది ధాన్యం కాదు. రెండు, మూడు రోజులు ఆలస్యమైతే మోర్టాలిటీ రేటు పెరుగుతుంది. కమిటీ అసలు దేనికి? చంద్రబాబు గారి హయాంలో విద్యుత్ సరఫరా షరతులు లేకుండా యూనిట్ రూ.2 చేయడం జరిగింది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రూ.4.50 వరకు వసూలు చేస్తున్నారు. రొయ్యల రైతులకు ట్రాన్స్ ఫార్మార్లు పెట్టాలంటే రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఏరియేటర్లు సబ్సీడీపై రూ.12వేలకు మేం ఇచ్చాం, మోటార్లు సబ్సీడీపై ఇచ్చాం. రొయ్యల రైతుకు రోజూ నరకం చూపిస్తున్నారు. జగన్ రెడ్డి నియమించిన కమిటీ రైతులకు నష్టం చేకూరుస్తోంది. ఒక్క రైతు వద్దనైనా రూ.210కి కొనుగోలు చేయించగలరా? ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి లంచాలు వసూలు చేయడానికే ఇదంతా చేస్తున్నారు. క్రాప్ హాలిడేకు వెళ్తామని విజయవాడలో రైతులు ప్రకటిస్తే.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ధాన్యం రైతులు కుదేలవుతున్నారు. టమోట కేజీ 50 పైసలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. రూ.3 వేల కోట్లతో ఏర్పాటుచేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? రొయ్యల రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రొయ్య వంద కౌంట్ రూ.240 నుంచి ఇప్పుడు రూ.210 చేశారు. మీ నోటి నుంచే రూ.30 తగ్గించారు. జగన్ రెడ్డి చర్యలు దురదృష్టకరం. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతులు అప్పులపాలవుతున్నారు. ఫీడ్ కాస్ట్ ఎందుకు తగ్గించరు, మద్దతు ధర ఎందుకు ఇవ్వరు, అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదు. ఆర్బీకేల్లో ధాన్యం కొనేది లేదు, వారంలో డబ్బులు వేసేది లేదు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image