ఎయిమ్స్‌లోనూ వైఎస్సార్‌ ఆరోగ్య‌శ్రీ సేవ‌లు


మంగళగిరి, గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి);


*ఎయిమ్స్‌లోనూ వైఎస్సార్‌ ఆరోగ్య‌శ్రీ సేవ‌లు**మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ*


*"సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్ "గా ఎయిమ్స్ అభివృద్ధి*


*ఎయిమ్స్ కు మౌలిక వ‌సతులు క‌ల్పించింది సిఎం జగన్*


*రూ.55 కోట్ల‌తో ఎయిమ్స్ కు నీరు , క‌రెంటు, రోడ్లు అందుబాటులోకి తెచ్చాం*


*ఎలాంటి స‌హ‌కారమైనా అందించేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఎల్లవేళలా సిద్ధంగా వున్నారు*


*ఎయిమ్స్ కోసం గత ప్రభుత్వం చేసింది శూన్యం*


*రోడ్లు, క‌రెంటు, మంచినీరు లాంటి వ‌స‌తుల‌ను సైతం బాబు విస్మ‌రించారు*


*ఎయిమ్స్‌లో మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప‌ర్య‌ట‌న‌*


*అన్ని విభాగాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించిన మంత్రి*


*మంత్రి వెంట వైద్య ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి, ఆరోగ్య‌శ్రీ సీఈవో, డీఎంఈ, ఎయిమ్స్ అధికారులు*


*ఎయిమ్స్ అధికారులు ,సిబ్బందితో మంత్రి  ప్ర‌త్యేక భేటీ*


మంగ‌ళ‌గిరిలోని ప్ర‌తిష్టాత్మ‌క ఎయిమ్స్ ను వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకురాబోతున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ, వైద్య విద్య  మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థను(ఎయిమ్స్) సోమ‌వారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని సంద‌ర్శించారు. ఆస్ప‌త్రిలో అందుతున్న వైద్య సేవ‌ల‌పై రోగుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అన్ని విభాగాల్లోనూ మంత్రి క‌లియ‌తిరిగారు. వైద్య ప‌రిక‌రాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. అనంత‌రం ఎయిమ్స్ అధికారులు, సిబ్బందితో  కాన్ఫ‌రెన్సు హాలులో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి వెంట వైద్య ఆరోగ్య శాఖ  కార్య‌ద‌ర్శి (కొవిడ్ మేనేజ్ మెంట్ & వ్యాక్సినేషన్ ) జిఎస్ న‌వీన్‌కుమార్‌, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్‌, ఆరోగ్య‌శ్రీ సీఈవో హ‌రీంద్ర‌ప్ర‌సాద్ , ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి , డీన్ డాక్టర్ జోయ్ ఘోషల్ త‌దిత‌రులున్నారు. త‌నిఖీ స‌మ‌యంలోనూ, మీడియా స‌మావేశంలోనూ మంత్రి మాట్లాడారు. ఎయిమ్స్‌లో ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామ‌న్నారు. 

అతి త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఆరోగ్య‌శ్రీ సేవ‌లు అందుబాటులోకొస్తాయ‌న్నారు. పేద ప్ర‌జ‌లంతా ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని మంత్రి సూచించారు. మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం అతి త్వ‌ర‌లోనే ఎంవోయూలు కుదుర్చుకోబోతోంద‌ని తెలిపారు. దీనివ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లోని విద్యార్థుల‌కు ఆయా అంశాల్లో ఎయిమ్స్ నుంచి అత్యుత్త‌మ శిక్ష‌ణ ల‌భిస్తుంద‌న్నారు. "సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్" గా ఎయిమ్స్ ను అభివృద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో ఉన్నామ‌ని, అందుకు కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు ప్రభుత్వం అందిస్తుంద‌న్నారు.

*తాగునీటి శాస్వత ప‌రిష్కారానికి ప‌నులు ప్రారంభం*

ఎయిమ్స్‌కు తాగునీటి స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించేందుకు ఆత్మ‌కూరు రిజ‌ర్వాయ‌ర్ నుంచి రూ.7.74 కోట్ల ఖ‌ర్చుతో పైపు లైను ప‌నులు మొద‌లుపెట్టామ‌ని చెప్పారు. సోమ‌వారం నుంచే ఈ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌న్నారు. తాత్కాలికంగా ఈ స‌మ‌స్య లేకుండా చేసేందుకు మంగ‌ళ‌గిరి- తాడేపల్లి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నుంచి రోజుకు 3.5ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు. మ‌రో ల‌క్ష లీట‌ర్ల నీటిని అత్య‌వ‌స‌ర స‌మయాల్లో వాడుకునేందుకు వీలుగా ప్ర‌తి రోజూ అందుబాటులో ఉంచుతున్నామ‌న్నారు. అవ‌స‌రమైన ప్ర‌తిసారీ ఈ నీటిని కూడా ఎయిమ్స్ కోసం వాడుకుంటున్నారని చెప్పారు. సంస్థ విస్త‌ర‌ణ‌లో భాగంగా రోజుకు అద‌నంగా మ‌రో 3 ల‌క్ష‌ల లీటర్ల నీరు అవ‌స‌ర‌మ‌ని త‌మ‌కు ఎయిమ్స్ నుంచి అభ్య‌ర్థ‌న వ‌చ్చింద‌ని, రోజుకు ఈ 3 ల‌క్ష‌ల లీటర్ల నీటిని విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నుంచి కూడా అద‌నంగా , ఉచితంగా అందజేస్తున్నామ‌ని వివ‌రించారు.

*క‌రెంటు, రోడ్లు స‌మ‌కూర్చాం*

ఎయిమ్స్‌కు మౌలిక స‌దుపాయ‌లైన రోడ్లు , క‌రెంటు ను ప్ర‌భుత్వ‌మే కల్పించిందన్నారు. రూ.35 కోట్లతో 132 కేవీ స‌బ్‌స్టేష‌న్‌ను   ఎయిమ్స్ కోసం  ప్రభుత్వం నిర్మించి ఇచ్చింద‌న్నారు. దాదాపు రూ.10 కోట్ల వ్య‌యంతో రోడ్లు, డ్రెయినేజి పనుల‌ను త‌మ ప్ర‌భుత్వ‌మే చేప‌ట్టింద‌న్నారు. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు అనుమ‌తులు ద‌క్కేలా చేశామ‌న్నారు. అట‌వీ అనుమతుల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామ‌న్నారు. ఎయిమ్స్ ప్రాంతంలో ఉన్న పాత టీబీ సెంట‌ర్ భ‌వ‌నాల‌ను తొల‌గించింది కూడా త‌మ ప్ర‌భుత్వ‌మేన్నారు. డంపింగ్ యార్డు స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించామ‌న్నారు. ఎయిమ్స్‌కు వెళ్లే ర‌హ‌దారుల‌కు సెంట్ర‌ల్ లైటింగ్ సౌక‌ర్యం కూడా క‌ల్పించామ‌న్నారు. మొత్తం రూ.55 కోట్లను ఎయిమ్స్ లో వ‌స‌తుల కోసం త‌మ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు ఖ‌ర్చు చేసింద‌ని వివ‌రించారు. 

మ‌రోవైపు ఎయిమ్స్‌లాంటి సంస్థ‌ను మ‌న రాష్ట్ర హ‌క్కుగా రాష్ట్ర విభజనానంతరం కేంద్ర ప్ర‌భుత్వం నుంచి పొందితే..గత  ప్ర‌భుత్వం ఈ సంస్థ‌కు ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌కుండా  గాలికి వదిలేసింద‌ని మండిప‌డ్డారు. ఏదైనా ఒక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేయాల‌న్నా, ఒక ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పాల‌న్నా.. ముందు మౌలిక వ‌స‌తులు స‌మ‌కూర్చాల‌నే క‌నీస క‌ర్త‌వ్యాన్ని, ప్రాథ‌మిక సూత్రాన్ని పాటించ‌లేద‌ని విమ‌ర్శించారు. ఎయిమ్స్‌కు క‌రెంటు ఇద్దామ‌నే ఆలోచ‌నే చేయలేద‌న్నారు. క‌నీసం రోడ్లు కూడా నిర్మించి ఇవ్వ‌లేద‌న్నారు. మంచినీటి స‌మ‌స్య ఉంద‌ని మొత్తుకున్నా.. క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. 

*ప్ర‌భుత్వ స‌హ‌కారం ప‌రిపూర్ణంగా ఉందిః ఎయిమ్స్ డైరెక్ట‌ర్ త్రిపాఠి*

ఎయిమ్స్ కు సంబంధించిన‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ‌కు పూర్తిగా స‌హాయ‌స‌హ‌కారాలు అంద‌జేస్తోందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ త్రిపాఠి ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వం దృష్టికి ఏ స‌మ‌స్య‌ను తీసుకెళ్లినా.. వెనువెంట‌నే స్పందించి ప‌రిష్క‌రిస్తోందన్నారు. మంచినీటి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా జీవో విడుద‌ల చేసింద‌ని, ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌న్నారు.కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు, ఎయిమ్స్ సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image