చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి

 *- చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి


 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* గుడివాడ, నవంబర్ 29 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహిస్తున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ పిలుపునిచ్చారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీ ఉదయం కలపర్రు టోల్ గేట్ దగ్గర నుండి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుందన్నారు. విజయరాయి వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు. అక్కడ "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" అనే కార్యక్రమాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అక్కడి నుండి దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల సరిహద్దు గ్రామం రామచంద్రాపురంలో రైతులతో చంద్రబాబు మాట్లాడతారని తెలిపారు. సాయంత్రం చింతలపూడి చేరుకుని రోడ్ షో నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలనుద్ధేశించి చంద్రబాబు మాట్లాడతారని, అనంతరం రాత్రికి చింతలపూడిలోనే బస చేస్తారని అన్నారు. డిసెంబర్ 1వ తేదీన చింతలపూడి నుండి బయలుదేరి తాడువాయి, బుట్టాయిగూడెం మీదుగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. అక్కడి నుండి పోలవరం మీదుగా కొవ్వూరు చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. అదే రోజు రాత్రి కొవ్వూరులోనే బస చేస్తారన్నారు. 2వ తేదీన కొవ్వూరు నుండి బయలుదేరి రోడ్ షో నిర్వహిస్తూ నిడదవోలు చేరుకుంటారన్నారు. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. అక్కడి నుండి రోడ్ షోగా బయలుదేరి తాడేపల్లిగూడెం చేరుకుంటారన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించే భారీ బహిరంగ సభతో చంద్రబాబు మూడు రోజుల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగుస్తుందన్నారు. చంద్రబాబు పర్యటనను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు పర్యటన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపనుందని శిష్ట్లా లోహిత్ అభిప్రాయపడ్డారు.

Comments