ప్రజలు తమ ప్రభుత్వం పాలన పట్ల నూటికి నూరు శాతం సంతోషం వ్యక్తపరుస్తున్నారు.


కొల్లిపర (ప్రజా అమరావతి);       ప్రభుత్వ ఆదేశాల మేరకు కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఐదవ రోజు తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్  "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల ఎంపీపీ, గ్రామ ఎంపీటీసీ,గ్రామ సర్పంచ్ మరియు గ్రామ YSRCP నాయకులు మరియు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు, మరియు సంబంధిత అధికారులతో కలసి గడప గడప కు వెళ్లి వారికి ఈ ప్రభుత్వం లో గత 3 సంవత్సరాల నుంచి అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, వారు వారి కుటుంబాల వారీగా  పొందిన లబ్ది ను సవివరంగా వివరించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ చేదోడు, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సున్న వడ్డీ రుణాలు, రైతు భరోసా పథకాలు, ఆరోగ్య శ్రీ సేవలు, పేదలందరికీ ఇల్లు, జలయజ్ఞం, మన బడి నాడు నేడు, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ బీమా, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ కళ్యాణ కానుక,  వైయస్సార్ చేయూత మొదలైన పథకాల ద్వారా మరియు ఎన్నో సబ్సిడీ స్కీములు ద్వారా ప్రజలకు జగనన్న ఈ ప్రభుత్వం లో చేయాలనుకున్న మంచి ఆయన కృషి నీ ప్రజల్లోకి విస్తృతం గా తీసుకెళ్లారు.గత ప్రభుత్వం లో అధికారం కోసం పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలను తుంగ లో తొక్కారని, కానీ జగనన్న ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని, ఈ పథకాలను అమలుపరిచారని తెలిపారు.కరోనా మహమ్మారి, గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పులు, ప్రకృతి బీభత్సాన్ని సైతం తట్టుకొని ప్రజలకు మేలు చేస్తున్న జగన్ అన్న మంచి మనసు దూరదృష్టి మరెవ్వరికీ లేదని కితాబిచ్చారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించేలా చేసే రైతులకు సర్టిఫికేషన్
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image