విజయవాడ (ప్రజా అమరావతి);
*క్రిస్మస్ సందర్భంగా విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజరైన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే....:*
అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు ఇంకా ఒదగాలి.
మనం సేవకులం అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇది నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉండే అంశం.
నేను ఈ రోజు మీ బిడ్డగా ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి కారణం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే. దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం రావాలని, ఇంకా ఒదిగి ఉండే పరిస్థితి కూడా దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా గొప్ప సేవకుడిగా, మరింత మెరుగ్గా సేవచేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ పేరు, పేరునా మెర్రీ క్రిస్మస్ అని సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం, ఉపముఖ్యమంత్రులు కె నారాయణస్వామి, అంజాద్ బాష, మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, విడదల రజిని, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment