యూనివర్సిటీ విద్యార్థినిలు గ్రామాలకు వెళ్లి మహిళా అభివృద్ధికి పాటు పడాలి : భారత రాష్ట్రపతి*యూనివర్సిటీ విద్యార్థినిలు గ్రామాలకు వెళ్లి మహిళా అభివృద్ధికి పాటు పడాలి : భారత రాష్ట్రపతి*


తిరుపతి, డిసెంబర్ 05 (ప్రజా అమరావతి): శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒక శక్తి స్థలం, ఇక్కడ చదివే విద్యార్థినిలు గ్రామాలకెల్లి మహిళ అభివృద్దికి పాటుపడాలని గౌ.భారత రాష్ట్రపతి దౌపది ముర్ము అన్నారు. సోమవారం మద్యాహ్నం భారత రాష్ట్రపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా సాధికారిత కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని స్వయం సహాయ సంఘాల సభ్యులతో, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలతో , విద్యార్తినిలతో, ప్రోఫెసర్లతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.


శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చేరుకున్న గౌ.భారత రాష్ట్రపతికి నగర మేయర్ డా.శిరీషా, జాయింట్ కలెక్టర్ డి.కె.బాలజీ , నగరపాలక  కమిషనర్ అనుపమ అంజలి, విసి డా.జమున, రిజిస్ట్రార్ మమత స్వాగతం పలికారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహిళా సాధికారిత, ఉత్పత్తుల  స్టాల్స్ పరిశీలించి, ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. వేదికపై మినిస్టర్ ఇన్ వైటింగ్ హోదాలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, యునియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం డి.ఓ.ఎన్.ఇ.ఆర్. కిషన్ రెడ్డి రాష్ట్రపతి తో పాటు ఆశీనులయ్యారు. ముఖాముఖి ప్రారంభం ముందు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంయుక్తంగా , విసి జమున గౌ. భారత రాష్ట్రపతిని సన్మానించారు.


 అనంతరం భారత రాష్ట్రపతి మహిళా సాధికారతలో ప్రతిభ కనబరిచిన మహిళల తో ముఖాముఖి ప్రారంభించారు.


          అనంతరం భారత రాష్ట్రపతి వారు మాట్లాడుతూ మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది ఎంతో గర్వకారణంగా ఉంది, మీరు మాట్లాడిన విషయాలు నాకు చాలా విషయాలు తెలిసాయి మహిళలు ఎవరికీ తక్కువ కాదు అని నమ్ముతున్నాను. నిన్న నేను నేవీ డే కార్యక్రమంలో పాల్గొన్నాను అందులో చూశాను మహిళలు దుర్భలురు కారని  అబల కాదు సబల అని, శక్తిమంతులని మహిళలు పురుషులతో సమానంగా పోటీపడాలని, సంపన్న భారతావనిలో 50 శాతం రిజర్వేషన్లు వున్నాయని ఆదిశగా అడుగులు వేసి మహిళా సాధికారతలో  దేశం కోసం పాటు పడాలని  అన్నారు. భారత రాష్ట్రపతిగా నేను మొదట పర్యటించిన విశ్వవిద్యాలయం ఇదే నని , ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి గ్రామీణ ప్రాంత సేవల్లో పాల్గొని మహిళా సాధికారత దిశగా సమాజ సేవలందిచాలని అన్నారు. గ్రామాలకు వెళ్లినపుడు  అక్కడ వారి స్థితిగతులను మహిళలతో మాట్లాడి పథకాలు వారికి అందుతున్నాయా లేదా అని పరిశీలించి   రిపోర్టును కలెక్టర్ కు  అందించగలగాలని  సూచించారు. నేడు ఇక్కడ  ఎస్ హెచ్ జి మహిళల విజయ గాధలలో రాధా అనే మహిళ పడిన సంఘర్షణ ప్రస్తావించ దగినదని, ఏ పని కూడా చిన్న పెద్ద పని తేడా ఉండరాదని చేసే పనిని గౌరవ దృష్టి తో చూడాలని అన్నారు. చిన్న పెద్ద అనేదాన్ని బట్టి గౌరవం రాదని మనం ఎన్నుకున్న  పని గొప్పదే నా దృష్టిలో అని అన్నారు. గతంలో నన్ను వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నప్పుడు నేను స్వీపర్లు తో కలిసి పని చేయించడానికి నామోషీ  పడలేదని అన్నారు. మనసు పెట్టి చేసే పని కావాలి అంతే,  దేశాన్ని ఉన్నత స్థితిలో నిలిపే క్రీడలు చూస్తే క్రికెట్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ విలువిద్య ఎన్ని అయితే క్రీడలు ఉన్నాయో అన్నింటిలో అబ్బాయిలు ఎంత ముందంజలో ఉంటున్నారు అంతే అమ్మాయిలు కూడా ముందంజలో ఉన్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయం మేరకు ఆత్మనిర్బర్ భారత్ లో భాగస్వామ్యులు కావాలని అన్నారు. నేడు భారత దేశం టెక్నాలజిలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో  ముందుందని, మహిళా సంఘాలు కొత్తపుంతలలోకి రావాలని అన్నారు. నేడు ఇక్కడ ముఖాముఖిలో మహిళా సాధికారిత సాదించిన మహిళలను ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. అనేక క్రీడలు వున్నాయి  అందులో  మహిళలు రానించాలి, కూచిపూడి ఒక రాష్ట్రానికే పరిమితం కాకూడదు దేశ, ప్రపంచ వ్యాప్తంగా వెలుగొందాలి , మనదేశంలో  ఒక్కొక్క చోట ఒక్కోసాంప్రదాయం వుంది, విభిన్న సంస్కృతుల భారతావని అని అన్నారు. సురక్షిత పర్యావరణం లక్ష్యంగా వాతావరణ మార్పులు తగ్గించడానికి మనం కృషి చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్రాలు మహిళ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి పూర్తి స్థాయిలో  సద్వినియోగం అవసరం, పురుషులతో పోటీ పడి సమాజంలోకి వెళ్ళాలి శక్తి స్వరూపిణి మహిళగా రానించాలి అన్నారు. చదువు లేకున్నా కూడా అభివృద్ధిలో భాగస్వాములుగా మహిళలు ఉన్నారని  మన కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఆలోచించాలని అన్నారు. నేటి సమావేశంలో తనకు మహిళ శక్తిపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు.  


          ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా , దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ,  ఎస్.వి.యు విసి ప్రో.కె.రాజారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ,ఆర్దిఒ కనకనరసా రెడ్డి, పిడి లు మెప్మా రాదమ్మ, డిఆర్ డి ఎ జ్యోతి , జిల్లా అధికారులు  విద్యావేత్తలు, విద్యార్థినిలు , ప్రొఫెసర్లు పాల్గొనగా  ప్రొఫెసర్ నీలిమ వ్యాఖ్యాత గా వ్యవహరించారు.


Comments