జగనన్న విదేశీ విద్యాదీవెన.. విదేశీ ఉన్నత విద్యకు ఆలంబన*జగనన్న విదేశీ విద్యాదీవెన.. విదేశీ ఉన్నత విద్యకు ఆలంబన**: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం ఆర్థిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రులు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 03 (ప్రజా అమరావతి):


*జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం విదేశీ ఉన్నత విద్యకు ఆలంబనగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం జగనన్న ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకోసం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పేద విద్యార్థులకు వరంగా మారింది. ఈ పథకం కింద నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ వరల్డ్ యూనివర్సిటీ క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 200 యూనివర్సిటీలను ఎంపిక చేసి వాటిలో ప్రవేశం పొందితే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది. ప్రపంచంలో వందలోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లించడం జరుగుతుండగా, 101 నుంచి 200 ర్యాంక్ కలిగిన వాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుండడంతో పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు వీలు కలుగుతోంది. విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం అందించేందుకు విద్యార్థుల ఎంపిక పారదర్శకంగా చేపట్టడం జరుగుతోంది. విదేశీ విశ్వవిద్యాలయానికి వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా చార్జీలు సైతం ప్రభుత్వం రియంబర్స్ చేస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి అర్హతను 8 లక్షలకు పెంచి మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు, జీవితంలో స్థిరపడేందుకు అవకాశం కలుగుతోంది.*


*జగనన్న విదేశీ విద్యాదీవెన కింద శ్రీ సత్యసాయి జిల్లాలో ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. జిల్లాలోని ఓడిచెరువు మండలం పగడలవారిపల్లి గ్రామానికి చెందిన ధర్మవరం అనిత D/o డి. గంగులప్ప, కొత్తచెరువు మండలం బసవన్నకట్ట స్ట్రీట్ లోని కె. రాజశేఖర్ రెడ్డి S/o కె. శివారెడ్డి, పెనుకొండ మండలం కొండంపల్లి గ్రామానికి చెందిన గుండపనేని భార్గవ్ సాయి S/o జి. శ్రీహరి అనే విద్యార్థులు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఎంపిక కావడం జరిగింది. శుక్రవారం రోజు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద మొదటి విడతగా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని తాడేపల్లి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. పేద విద్యార్థుల చదువుకు ఆలంబనగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.*


*1. ఉన్నత చదువులు చదివేందుకు ఎంతో ఉపయోగం*

*: జి.శ్రీహరి - కవిత, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఎంపికైన విద్యార్థి గుండపనేని భార్గవ్ సాయి తల్లిదండ్రులు, కొండంపల్లి గ్రామం, పెనుకొండ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా.*


మాది నిరుపేద వ్యవసాయ కుటుంబం. నాకు నా రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ మా కుమారుడు భార్గవ్ సాయిని ఎంతో కష్టపడి బెంగళూరులో బీటెక్ చదివించాం. మా కుమారుడు జనవరిలో అమెరికా వెళ్లి బోస్టన్ యూనివర్సిటీ లో కంప్యూటర్ కోర్స్ చదువుతున్నాడు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద మా కుమారుడి విదేశీ ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మాలాంటి నిరుపేద తల్లిదండ్రులకు జగనన్న అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. నాకు 3,000 రూపాయల పింఛన్ వస్తోంది. విద్యకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.


*2. ఆర్థిక సహాయం అందించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది.*

*: శివారెడ్డి - పద్మావతి, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఎంపికైన విద్యార్థి కె.రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు, బసవన్న కట్ట స్ట్రీట్, కొత్తచెరువు మండలం, శ్రీ సత్యసాయి జిల్లా.*


మాకున్న 2.10 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ ఆధారపడి జీవిస్తున్నాము. ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో కూడా మా కుమారుడిని ఎంతో కష్టపడి ఉన్నత చదువు చదివించాం. మా కుమారుడు అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నాడు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద మా కుమారుడి విదేశీ ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. నాకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద రెండుసార్లు లబ్ధి కలిగింది. నా భార్యకు రెండుసార్లు డ్వాక్రా రుణమాఫీ జరిగింది, పావలా వడ్డీ కింద లబ్ధి కలిగింది. ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న మాలాంటి నిరుపేద కుటుంబాల పిల్లల విదేశీ ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం చేయడం ఎంతో గొప్ప విషయం. ఇంతకుముందు ఎవరు ఇలా సహకారం అందించలేదు. మాలాంటి నిరుపేదలను ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాము.


*3. రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు*

*: డి.గంగులప్ప, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఎంపికైన ధర్మవరం అనిత తండ్రి, పగడలవారిపల్లి గ్రామం, ఓడి చెరువు మండలం, శ్రీ సత్యసాయి జిల్లా.*


నాకున్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ నా కుమార్తెను చదివించాము. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కౌలు చేసుకుని మరీ కష్టపడి పులివెందుల జేఎన్టీయూలో బీటెక్ చదివించాం. నా కుమార్తె ప్రస్తుతం ఇటలీలోని బోలోగోనలోని అల్మాటర్ మేటర్ స్టూడియోరమ్ యూనివర్సిటీ ఆఫ్ బోలోగోనలో ఎమ్మెస్సీ సివిల్ ఇంజనీర్ చదువుతోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద మా కుమార్తె విదేశీ ఉన్నత చదువుకే ఆర్థిక సహాయం గతంలో ఎన్నడూ లేని విధంగా అందించడం పట్ల ఆనందంగా ఉంది. ఆర్థిక సహాయం మా కుమార్తె బాగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వైఎస్సార్ రైతు భరోసా కింద నాకు లబ్ధి కలుగుతోంది. మాలాంటి పేదవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల అండగా ఉంటున్నారు. ఎందుకు సీఎం జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.Comments