రాజానగరం (ప్రజా అమరావతి);
మినీ జాబ్ మేళాకు 52 మంది హాజరుకాగా, 26 ఎంపిక (సెలెక్టు) అయ్యారు..
రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళాల ద్వారా కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాది కల్పనాదికారి కే. హరిశ్చంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రాజానగరం మండల ప్రజ పరిషత్ కార్యాలయం నందు గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద “మీని జాబ్ మేళ” నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాది కల్పనాదికారి కే. హరిశ్చంద్ర ప్రసాద్ తూర్పుగోదావరిజిల్లా లోని నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “జాబ్ మేళా” లో భాగంగా జిల్లాలోని రాజానగరం మండలం స్థానిక మండల ప్రజ పరిషత్ కార్యాలయం నందు గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద “మీని జాబ్ మేళ” జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జాబ్ మేళా ల ద్వారా అర్హులైన అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనన్నారు.
ఈ జాబ్ మేళాలో ప్రముఖ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇండియన్ డైరీ ఎక్విప్మెంట్ అండ్ ఫ్యాబ్రిక్స్ కంపెనీల్లో దాదాపు 86 నియామకాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మిని జాబ్ మేళాకు 52 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 26 ఎంపిక (సెలెక్టు) అయ్యారని జిల్లా నైపుణ్యాధికారి ఎమ్. కొండలరావు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్లేస్ మెంట్ ఎగ్జిక్యూటివ్ లు రాజ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment