పార్టీకి పట్టిన ఉండవల్లి శ్రీదేవి శని వదిలింది.

 పార్టీకి పట్టిన ఉండవల్లి శ్రీదేవి శని  వదిలింది



 విలేకరుల సమావేశం తాడికొండ నియోజకవర్గం వైసిపి నాయకుల వెల్లడి


సీఎం జగన్ మాటలే మాకు శిరోధార్యం


కత్తెర సురేష్ కుమార్ వెల్లడి


అమరావతి (ప్రజా అమరావతి);


పార్టీకి నియోజకవర్గానికి పట్టిన శని వదిలిందని ఇన్నాళ్లు భరించి ఓపిక నశించిందని తాను తీసుకున్న గోతిలో తానే పడిందని తాడికొండ నియోజకవర్గం వై ఎస్ ఆర్ సి పి నాయకులు పేర్కొన్నారు. గుంటూరులోని తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని వై ఎస్ ఆర్ సి పి నాయకులు పాల్గొని మాట్లాడారు. తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేసిన ఉండవల్లి శ్రీదేవి చేసిన అరాచ కాల కు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. ఆమెను సస్పెండ్ చేసి పార్టీ ఎంతో మేలు చేసింది అన్నారు. ఆమెను చూసి తమ ఓటు వేయలేదని జగన్ మోహన్ రెడ్డిని చూసి ఓటు వేసాము అని తెలిపారు.

 ఈ సందర్భంగా తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించి  అవినీతి రాజకీయాలకు పాల్పడే వారికి పార్టీ తగిన రీతిలో బుద్ధి చెప్పిందని తప్పు చేసిన వారెవరైనా శిక్షకు పాత్రులని తెలిపారు. పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తనను తాడికొండకు సమన్వయకర్తగా పంపిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గంలో చేసిన అవినీతి కార్యక్రమాల గురించి అనేకమంది చెప్పారని, ఇన్నాళ్లు ఓపిక పట్టిన  అధిష్టానం ఇక సహించలేక పార్టీ నుండి బహిష్కరించిందని వెల్లడించారు. తాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తామని, ఆయన మాట తమకు శిరోధార్యమని వెల్లడించారు. నియోజకవర్గంలో అందర్నీ కలుపుకు వెళ్తామని తెలిపారు .పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో  జడ్పిటిసి దాసరి కత్తి రేణమ్మ, వైసీపీ నాయకులు తాళ్ల శివ నాగరాజు యాదవ్, బుర్ర వెంకట శివారెడ్డి, రామచందర్రావు, బెజ్జం రాంబాబు, పున్నారావు,          ఆ లోకం సురేష్, ఇంకా పలువురు నాయకులు మాట్లాడారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన వైసిపి నాయకులు, విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Comments