భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డా ఎ.మల్లికార్జున డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ - సంజీవిని నిధి నుండి తక్షణ సహాయం

 


విశాఖపట్నం, మార్చి 25  (ప్రజా అమరావతి): ఈ నెల 22వ తేది బుధవారం అర్ధరాత్రి విశాఖ నగరం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు  జిల్లా కలెక్టర్ డా ఎ.మల్లికార్జున   డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ - సంజీవిని నిధి నుండి  తక్షణ సహాయం


అందజేసారు.  

    శనివారం ఉదయం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ప్రమాదంలో మరణించిన సాకేటి దుర్గా ప్రసాద్, సాకేతి అంజలి కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఇరవై వేల రూపాయలు చెక్కును,   బీహార్ కు చెందిన రాముల్లా సాహ్ కుటుంబానికి పదిహేను వేల రూపాయల  చెక్కును జిల్లా కలెక్టరు  అందజేశారు. ఘటన కు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి పంపడం జరిగిందని, ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే పూర్తి నష్ట పరిహారం అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టరు తెలిపారు.



Comments