శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు కొత్తూరు, తాడేపల్లి కు చెందిన శ్రీ భీమవరపు సామిరెడ్డి గారు మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలoకారం నిమిత్తం 52 గ్రాములు బరువు గల బంగారు లక్ష్మీ కాసుల హారం మరియు జె. వి. డి.వి ప్రసాద్ రెడ్డి, తాడేపల్లి వారు 25 గ్రాములు బరువు గల బంగారు కాసుల నెక్లెస్ ను ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు ఉన్నారు. ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment