కొవ్వూరు లో ఏప్రిల్ 14 న వాలంటీర్ కు వందనం కార్యక్రమం



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి) : 





* కొవ్వూరు లో ఏప్రిల్ 14 న వాలంటీర్ కు వందనం కార్యక్రమం 


* కొవ్వూరు కె జి ఎం హై స్కూల్ ప్రాంగణంలో హెలిప్యాడ్


* 2.1 కి మీ మేర ముఖ్యమంత్రి రోడ్ షో


* వేసవి దృష్ట్యా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి 


* మండల వారీగా కార్యాచరణపై దిశా నిర్దేశం


* కొవ్వూరు పరిధిలో 13 చోట్ల వాహనాల పార్కింగ్ సౌకర్యం 



- కలెక్టర్ కె.మాధవీలత


జిల్లాలో కొవ్వూరు కేంద్రంగా జరుపుతున్న వాలంటీర్ కు వందనం రాష్ట్ర స్థాయి వేడుకలు అత్యంత పటిష్టంగా నిర్వహించడంలో శాఖల అధికారులు మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.



సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సిఎం పర్యటన పై జిల్లా, డివిజన్,  మండల వారిగా ముందస్తు కార్యాచరణ పై కలెక్టర్ కె.మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్, కమిషనర్ కె. దినేష్ కుమార్ డి ఆర్వో జీ. నరసింహం లు సమీక్ష నిర్వహించారు.



ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 14 న ముఖ్య అతిథిగా హాజరు కానున్న పర్యటన విజయవంతం చేయడం లో ప్రతి ఒక్కరూ నిబద్దత తో కూడి పని చేయాల్సి ఉందన్నారు. జిల్లా ఏర్పాటు చేసిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రావడం ఏడోవసారి అన్నారు.  జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా ఆయా పర్యటన లను విజయవంతంగా నిర్వహించు కో గలిగామన్నారు. ఏప్రిల్ 14 న జరుపుతున్న వాలంటీర్ కు వందనం కార్యక్రమాన్ని అదే తరహాలో విజయవంతం చెయ్యాల్సి ఉందన్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు క్రమ పద్ధతిలో సకాలంలో చేరువ చెయ్యడంలో వాలంటీర్ ల యొక్క పాత్ర ప్రధానమైనదన్నారు. అటువంటి వాలంటీర్ సేవల గుర్తింపు గా వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. వేసవి దృష్ట్యా తగిన మెడికల్ క్యాంపులు, అత్యవసర మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్టీసి, రవాణా శాఖ అధికారులు తగిన వాహనాలు సిద్దం చేసుకొని ఆయా మండలాలకు ముందస్తుగా రూట్ మ్యాప్ మేరకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 



జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ నియోజక వర్గాల వారీగా కావలసిన వాహనాల వివరాలు పై సమీక్ష నిర్వహించామన్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా స్థానిక ప్రజా ప్రతినిదులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. సిఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న రోడ్ షో కు ఎటువంటి ఆటంకం కలుగకుండా ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.



మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, మెప్మా, డిఆర్డీఏ ఆధ్వర్యంలో సిఎం బహిరంగ సభకు హాజరు కానున్న స్వయం సహాయక సంఘాలు, వాలంటీర్ లతో సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు.


ఈ సమావేశంలో డి ఆర్వో జీ. నరసింహులు,  ఆర్డీవో లు ఎస్. మల్లి బాబు, ఏ. చైత్ర వర్షిణి, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి,  సీపీఓ కె.ప్రకాష్ రావు, రీజనల్ మేనేజర్ (టూరిజం) వి. స్వామినాయుడు,డిహెచ్ఓ వి. రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్,  జిల్లా ప్రజా రవాణాధికారి షర్మిలా అశోక్ , డిఆర్డిఎ పిడి ఎస్. సుభాషిణి,  డి ఎల్ డిఓ  పి. వీణాదేవి, డీఎస్ఓ పి. ప్రసాదరావు, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఎస్. రామ్ మోహన్,  పలువురు జిల్లా శాఖా అధికారులు , ఎంపీడీఓ లు తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.



Comments