మచిలీపట్నం : ఏప్రిల్ 26 (ప్రజా అమరావతి);
*ముడా ముందస్తు నోటిఫికేషన్ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే, మే నెల 9 వ తేది లోపు తెలపండి !!*
*-- ఎమ్మెల్యే పేర్ని నాని*
ముడా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ముందస్తు నోటిఫికేషన్ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే, వచ్చ మే నెల 9వ తేది లోపున నేరుగా ముడా కార్యాలయానికి వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రజలకు సూచించారు.
బుధవారం మధ్యాహ్నం ఆయన స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని బిగ్ ఎల్ఈడి స్క్రీన్ పై ముడా మాస్టర్ ప్లాన్ ముందస్తు నోటిఫికేషన్ మ్యాపులో వివిధ ప్రాంతాలు చూపుతూ పలు విషయాలు తెలిపారు.
ఇటీవల కొందరు క్రైస్తవ సమాజంలో లేనిపోని అపోహలు సృష్టించేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలను వ్యాపింప చేసేందుకు పూనుకోవడం ఎంతో విడ్డూరమన్నారు. ముందస్తు నోటిఫికేషన్ లో మ్యాప్ ప్రకారం, ఎరుపు రంగు పబ్లిక్ - సెమీ పబ్లిక్ పరిధిని ప్రదర్శిస్తుందన్నారు అందుకు సంబంధించి దేవాలయాలు, చర్చిలు, మసీదులు, విద్యాసంస్థలు, మెడికల్, హెల్త్ సోషల్ కల్చరల్, ఖననం చేసే స్థలాలు, ప్రభుత్వ సంబంధత కార్యాలయాలు ఉంటాయన్నారు. ఈ మాత్రం అవగాహన లేని కొందరు కేవలం చర్చలను మాత్రమే ఎరుపు రంగులో చూపుతున్నారని పలు సామాజిక మాధ్యమాలలో విష ప్రచారం జరుగుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 2 వ తేదీ 2017 ముడా మాస్టర్ ప్లాన్ మ్యాప్ తయారు చేశారని, ఆ తర్వాత మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హెస్కొని డి హెచ్ సి కన్సాలిటెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో మార్చి 20 వ తేదీ 2018 పరస్పర ఒప్పందం సైతం చేసుకున్నారని నాటి ముడా విసి విల్సన్ బాబు ఆ అగ్రిమెంట్ పై అధికారికంగా సంతకం చేసారన్నారు. అజ్ఞానంతో కొందరు తానేదో కొందరి ఆస్తులను చర్చిలను ముడా పబ్లిక్ - సెమీ పబ్లిక్ పరిధిలోనికి తెచ్చినట్లు తెలివి తక్కువ వ్యాఖ్యలు చేయడం వారి అవగాహన రాహిత్యానికి తార్కాణమన్నారు.
మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సెంటర్ లోని వినాయకుని గుడి, రాజుపేట లోని కొత్త మసీదు, జామియా మసీద్ ఖబర్ స్తాన్, కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, కంతేటి వారి నిర్వహణలో కొనసాగిస్తున్న భావనారాయణ స్వామి దేవాలయం, గీతా మందిరం, చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం తదితర గుడులు మసీదులు సైతం పబ్లిక్ - సెమీ పబ్లిక్ పరిధిలో చూపుతూ ఎరుపు రంగుతో మార్క్ చేయబడిందని ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు భవిష్యత్తు విస్తృత ప్రయోజనాల నిమిత్తం ప్రజల కోసం నిర్దేశించబడిన అమృత నగరాల రూపకల్పనలో భాగంగా నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పబ్లిక్ సెమీ పబ్లిక్ విధానంతో మాస్టర్ ప్లాన్ మ్యాప్ తయారుచేయాలని నాటి ఒప్పందంలో ఉందన్నారు. 1997, 2011 సంవత్సరంలో మాస్టర్ ప్లాన్ అదేవిధంగా ఉందన్నారు ఇదే విషయాన్ని పాత మున్సిపల్ చట్టం సైతం పేర్కొంటుందన్నారు.
తమ ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు ఎన్నడూ పాల్పడదని, ప్రజలకు మేలు చేసే విధంగా నూటికి నూరు శాతం స్నేహపూరిత మాస్టర్ ప్లాన్ తయారుచేసి ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ ,ముడా విసి రాజ్యలక్ష్మి, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment