నెల్లూరు ఏప్రిల్ 19 (ప్రజా అమరావతి);
గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నామ
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం తోడేరు గ్రామం వీవర్స్ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తమ ఇంటి బిడ్డ వచ్చినంత ఆనందంతో గ్రామస్థులంతా ముఖ్యంగా మహిళలు వీధి వీధినా పూల జల్లులతో నింపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని చేనేత కుటుంబాలతో చిరకాలంగా అనుబంధం కల్గి ఉన్నానని, ప్రతి కుటుంబం తన సొంత కుటుంబం లాంటిదన్నారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందని తెలిపారు. మూడున్నర సంవత్సరాల పాలనలో ప్రజలు సంపూర్ణ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. కులమతాల కు, పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నందునే సియం కు చెక్కు చెదరని ప్రజాదరణ లభిస్తుందన్నారు. వెనుకబడిన తరగతులను ప్రత్యేకంగా గుర్తించి ఆదరించిన ప్రభుత్వమన్నారు. నేతన్న నేస్తం పధకం ద్వారా ఇప్పటివరకు 72 వేలు అందించామన్నారు. గతంలో గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు సమస్యలతో స్వాగతం పలికేవారని, నేడు సంతోషంతో ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతుంటే సంతృప్తి కలుగుతుందన్నారు. ప్రతి వర్గానికి ప్రభుత్వ పధకాలు అందించాలని తపన పడే ప్రభుత్వమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment