ప్రభుత్వ శాఖల ద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

 ప్రభుత్వ శాఖల ద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి


*


*స్పందన అర్జీలను నాణ్యతతో  పరిష్కరించాలి*


*స్పందనలో అర్జీలు ఎక్కువగా వస్తున్న... మొదటి ఐదు శాఖలను గుర్తించాలి*


*త్వరలో జిల్లాలలో పర్యటించనున్న ప్రత్యేక అధికారులు*


*ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య*

పుట్టపర్తి, ఏప్రిల్ -19 (ప్రజా అమరావతి) : ప్రభుత్వ శాఖల ద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నారాయణ భరత్ గుప్త తో కలిసి "జగనన్నకు చెబుదాం" అంశంపై జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు  స్థానిక కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్  హాలు  నందు  జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, డిఆర్ఓ కొండయ్య, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ... నవరత్నాల పథకాలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలలో ఆయా శాఖల ద్వారా ప్రజలకు నాణ్యమైన , మెరుగైన సేవలను సంతృప్తస్థాయిలో అందించాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా అందుతున్న అర్జీలను నాణ్యవంతంగా పరిష్కరించడం ద్వారా... ఎక్కువ శాతం ప్రజల సమస్యలు తొలగి అధికారులపై ఒక మంచి నమ్మకం ఏర్పడుతుందన్నారు. స్పందనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక అనాలసిస్ చేశామని, ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి, హోమ్, వైద్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం తదితర 5 శాఖలకు సంబంధించి అర్జీలు తరచు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలలో కూడా స్పందనలో అర్జీలు ఎక్కువగా వస్తున్న మొదటి ఐదు శాఖలను గుర్తించాలని చెప్పారు. రెవిన్యూ, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, గృహ నిర్మాణం తదితరాలలో తరచూ క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. స్పందనలో ఏ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, ఎందులో వస్తున్నాయి, ఏ శాఖకు సంబంధించి ఎక్కువగా వస్తున్నాయి తదితర అంశాలలో జిల్లాస్థాయి అనాలసిస్ ను రూపొందించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నాణ్యవంతంగా మెరుగ్గా పరిష్కరిస్తున్నారా లేదా, ఇంకనూ తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై పరిశీలించడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియమించిందన్నారు. వీరు త్వరలో అన్ని జిల్లాలలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడి కేంద్రాలు, వసతి గృహాలు, సచివాలయాలలో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాములు అమలు చేయాలని, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ, సచివాలయాలలో  మెరుగైన సేవలను అందించేలా జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, సిబ్బందిని పర్యవేక్షణ చేయాలన్నారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డీఎంహెచ్వో  కృష్ణారెడ్డి,  వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments