ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకోవాలి.

 *ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకోవాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


*: కొత్తచెరువు జగనన్న హౌసింగ్ లేఔట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 29 (ప్రజా అమరావతి):


ఇళ్ల నిర్మాణాల్లో మరింత వేగం పుంజుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తచెరువు మండల కేంద్రం వద్దనున్న 384 జగనన్న హౌసింగ్ లేఔట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపడుతోందన్నారు. కొత్తచెరువు మండల కేంద్రంలోని 384 జగనన్న హౌసింగ్ లేఔట్ లో 177 ఇల్లు మంజురుకాగా, 36 బిలో బేస్మెంట్ స్థాయిలో, 103 బేస్మెంట్ స్థాయిలో, 8 ఆర్ ఎల్ స్థాయిలో, 10 ఆర్సీ స్థాయిలో ఉన్నాయని, మరో 17 పూర్తయ్యాయన్నారు. ఇక్కడే ఉన్న 292 లేఔట్ లో 197 ఇల్లు మంజూరు కాగా, 37 బిలో బేస్మెంట్ స్థాయిలో, 106 బేస్మెంట్ స్థాయిలో, 11 ఆర్ ఎల్ స్థాయిలో, 10 ఆర్సీ స్థాయిలో ఉన్నాయని, మరో 30 పూర్తయ్యాయన్నారు. అలాగే 483 లేఔట్ లో 326 ఇల్లు మంజూరు కాగా, 81 బిలో బేస్మెంట్ స్థాయిలో, 225 బేస్మెంట్ స్థాయిలో, 4 ఆర్ఎల్ స్థాయిలో, 3 ఆర్సీ స్థాయిలో ఉన్నాయని, మరో 13 పూర్తయ్యాయన్నారు. ఆయా లేఔట్ లలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం వేగవంతమయ్యేలా చూడాలన్నారు. బేస్మెంట్ స్థాయిలో, ఆర్ ఎల్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేలా నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆయా లేఔట్ లలో అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా లేఔట్ లలో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.  బేస్మెంట్ స్థాయిలో ఆగిపోయిన ఇళ్లను లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు జరిగేలా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, తహసీల్దార్ రామాంజనేయులు, హౌసింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments