*గడప గడపకు మన ప్రభుత్వం పనులను వేగవంతం చేయాలి*
*: గ్రౌండింగ్ కాని పనులను వెంటనే పూర్తిగా గ్రౌండింగ్ చేయాలి*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 15 (ప్రజా అమరావతి):
గడప గడపకు మన ప్రభుత్వం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సిపిఓ, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్, బత్తలపల్లి, బుక్కపట్నం, ధర్మవరం, తలుపుల, రొళ్ల తదితర మండల ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని గుర్తించగా ఆ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు త్వరితగతిన పంపించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కింద 1,466 పనులు మంజూరు కాగా 995 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన పనులకు టెక్నికల్ శాంక్షన్ తీసుకోవాలన్నారు. పనులు మంజూరైనా గ్రౌండింగ్ కాకుండా పెండింగ్ ఉన్న 180 పనులను వెంటనే గ్రౌండింగ్ చేపట్టాలని ఎంపిడిఓలను ఆదేశించారు. గుర్తించిన పనులకు ప్రతిపాదనలు మంగళవారంలోగా పంపించాలని, అనంతరం శాంక్షన్ తీసుకోవాలన్నారు. ఇప్పటికే చేపడుతున్న పనులను ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పనులు ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ లేకుండా చేపట్టాలని, సకాలంలో పనుల్లో పురోగతి తీసుకురావాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఎంఏయుడి శాఖల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేసి వేగంగా పూర్తి చేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసేలా అధికారులు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఓ విజయ్ కుమార్, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, బత్తలపల్లి ఎంపీడీవో మల్లికార్జున, బుక్కపట్నం శ్రీనివాసులు, ధర్మవరం ఎంపీడీవో మమత, తలుపుల రామా నాయక్, రొళ్ల ఎంపీడీవో రామారావు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment