మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం



 *మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం



 *ఎన్నికల మేని ఫెస్టో లో చెప్పిన ప్రకారం 98.44 శాతం అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదే* 

 

                                                         . రాష్ట్ర విద్యుత్,అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖ మాత్యులు*


*ఎన్నికల హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి* 


                                            *: జెడ్ పి చైర్మన్*


 *మహిళలు ప్రభుత్వం ద్వారా పొందిన ఆర్థిక లబ్ధి ని సద్వినియోగం చేసుకోండి*  

                                                         *: జిల్లా  కలెక్టర్* 


పులిచెర్ల/రొంపిచెర్ల, ఏప్రిల్ 6 (ప్రజా అమరావతి):* మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని గౌ. రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు.


గురువారం మూడవ విడత వై ఎస్ ఆర్ ఆసరా మూడవ విడత లబ్ది పంపిణీలో భాగంగా పులిచెర్ల మండల  పరిధిలోని 963 సంఘాలకు 8444 లబ్ధిదారులకు  రూ.11.75 కోట్లు, రొంపిచెర్ల మండలం పరిధిలో 583 సంఘాలకు 5056 సభ్యులకు రూ.5.60 కోట్లులకు సంబంధించిన మెగా చెక్కులను పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో  మంత్రి వర్యులు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,  జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ లతో కలసి  పంపిణీ చేశారు.


                      ఈ సందర్భంగా గౌ. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖమాత్యులు మాట్లాడుతూ గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వై.యస్. ఆసరా పథకంఅమలుచేస్తూగత సార్వత్రిక ఎన్నికల నాటికి స్వయం సహాయక సంఘాల మహిళలు సంఘాల ద్వారా పొందిన అప్పులో నిల్వ ఉన్న ఋణాలను నాలుగు విడతలలో చెల్లిస్తానని తన ఎన్నికల పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు వై.యస్.ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా రనన్నారు. వై. యస్.ఆర్ ఆసరా క్రింద జిల్లాలో 3 విడతలలో మొత్తం రూ.974 కోట్లు చెల్లించడం జరిగిందని తెలిపారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన ఇచ్చిన హామీ మేరకు 98.44 శాతం అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలకు అందజేస్తూ వారి అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి 2 లక్షల పై చిలుకు కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. పించన్ లకు సంబంధించి ఇచ్చిన మాట మేరకు అవ్వా తాతలకు రూ.2,750 లు అందజేయడం జరుగుతున్నదని, ఈ మొత్తాన్ని రూ. 3 వేలుకు పెంచడం జరుగుతుందన్నారు. కుల, మత, పార్టీ, ప్రాంతాలకతీతంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ ల ద్వారా పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదన్నారు. పెద్ద ఎత్తున ఇళ్ళ పట్టాలను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రాష్ట్రం మొత్తం మీద 31 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా 20 లక్షల ఇళ్ళ మంజూరు చేయడం జరిగిందన్నారు. నవరత్నాల పథకాల అమలులో భాగంగా తల్లిదండ్రులకు విద్య భారం కాకూడదని అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యతో పాటు వైద్య రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించడం జరుగుతున్నదని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కొరకు మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి ముంగిటికె అందజేసే విధంగా గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పంటకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితరాలను అందజేయడమే కాక రూ.3 వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుల పంటకు గిట్టుబాటు ధరలు కూడాఅందిస్తున్నారని తెలిపారు. నాడు - నేడు ద్వారా ఆసుపత్రులను అభివృద్ధి చేయడం జరిగిందని, అంతేకాక అవసరమైన 40 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, తదితర సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 3255 రకాల జబ్బులకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతున్నదని తెలిపారు. పశ్చిమ మండలాల్లో నీటి ఎద్దడి తీర్చడానికి 3 రిజర్వాయర్లు నిర్మాణంలో ఉన్నవి, ఈ నిర్మాణాలు పూర్తి అయితే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు మండలాలతో పాటు కరువు ప్రాంతాలకు నీటిని అందించగలమని .


  జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథ కాలను అమలు చేయడం జరిగింద న్నారు.


  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన మాట మేరకు వైయస్సార్ ఆసరా కార్యక్రమం ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరుతున్నదని, ఈ రుణాన్ని మహిళలు సద్విని యోగం చేసుకోవాలని, ఈ లబ్దితో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి  చెందాలన్నారు.


  టిటిడి పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాల అమలు చేయడం జరుగుతున్నదని అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకంగా పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు


                ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మూడో విడత వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఏ మరియు ఐసిడిఎస్, వ్యవసాయ శాఖలు వారు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతుల శాఖచే ట్రై సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది.


                   ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్, డి ఆర్ డి ఎ పీడీ తులసి, జడ్పీ సిఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆర్ డి ఓ రేణుకా,పులిచెర్ల, రొంపిచెర్ల ఎంపిపి లు సురేంద్ర రెడ్డి, పురుషోత్తం, జెడ్పిటిసి మురళీధర్, రెడ్డిశ్వర్ రెడ్డి, తహసీల్దార్ అమర్నాథ్, నాయకులు పెద్దిరెడ్డి, జింకా చలపతి, జయచంద్రా రెడ్డి, సలీం భాష రెడ్డి ఈశ్వర్ రెడ్డి, ఎం ఎస్ రెడ్డి, చెంచురెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 


Comments