చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు రువ్వడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం.

 *- చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు రువ్వడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం


*

 *- రాజకీయాల్లో భౌతిక దాడులు సరికాదు*

 *- వైసిపి రౌడీలకు భయపడే ప్రసక్తి లేదు*

 *- అరాచకాలపై పోరాటం చేస్తామని హెచ్చరించిన  వెనిగండ్ల* 


 గుడివాడ, ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి): ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రోడ్ షోకు వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు రువ్వడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని టిడిపి నేత వెనిగండ్ల రాము అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడలో వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో భౌతిక దాడులకు దిగడం సరికాదని హెచ్చరించారు.

చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్ఎస్జి కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయమైందని, దీనిబట్టి పోలీసుల భద్రత ఎంత డొల్లగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వైసిపి రౌడీలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రంలో వైసిపి మూకలు చేస్తున్న అరాచకాలపై చంద్రబాబు నాయకత్వంలో  పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు కాన్వాయ్ వరకు వైసిపి అల్లరి మూకలను పోలీసులు రానివ్వడాన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు. ఎన్ఎస్జి బృందం రక్షణగా లేకపోతే చంద్రబాబుపై రాళ్లు పడి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణం ఉన్న ప్రకాశం జిల్లాలో వైసిపి అలజడులు సృష్టిస్తోందన్నారు. రాళ్ల దాడికి పాల్పడిన అల్లరి మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.  లేకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వెనిగండ్ల హెచ్చరించారు.

Comments