పలుమార్లు వస్తున్న అర్జీల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుంది



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



స్పందన కార్యక్రమంలో భాగంగా పలుమార్లు వస్తున్న అర్జీల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుంద


ని   ఇంఛార్జి జిల్లా కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం విజయవాడ  సి ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి  ప్రణాళిక రంగంలో స్థిర అభివృద్ధి,   ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ పథకాలు అమలు లక్ష్యాలు, పాఠశాల విద్య, స్పందన, గ్రామ వార్డు సచివాలయ సేవలు, గడప గడపకు మన ప్రభుత్వం అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కె యస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి ఇంఛార్జి జిల్లా కలెక్టర్ తేజ్ భరత్, ఇతర  సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ తేజ్ భరత్ వివరాలు తెలుపుతూ, స్థిర అభివృద్ధి లక్ష్యలను సాధించడం కోసం క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని అన్నారు. 7,55,271 కుటుంబాలకు గానూ 5,42,502 సంబందించిన ఆరోగ్య డేటా ఎంట్రీ చెయ్యడం జరిగిందన్నరు. ఆరోగ్య పరిరక్షణ లో స్థిర అభివృద్ధి లక్ష్యాలలో 40,101 మంది పిల్లలలో 39,649  మంది వివరాలు సేకరించడం జరిగిందన్నారు. 19 మంది నుంచి వొచ్చిన అర్జీల పరిశీలించడం జరిగిందన్నారు. జిల్లాలో 6,40,884 కుటుంబాలలో ఫీవర్ సర్వే చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. పౌష్టికాహర లోపం ఉన్న 2,943 పిల్లలకు పౌష్టికాహర

అందిస్తున్నట్లు తెలిపారు.  గర్భిణులకు చెంది 12288 మందిలో 116 మంది తీవ్ర అనమినియా తో ఉన్నట్లు గుర్తించామని, వీరి విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీలను ముందస్తు జాగ్రత్తలకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు.


 గడప గడపకు మన ప్రభుత్వ కింద 512 సచివాలయ పరిధిలో 1152 పనులు గుర్తించి వాటిలో 1106 పనులకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని తేజ్ భరత్ తెలిపారు.  వాటిలో 997 పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.  బడి బయట పిల్లలను 1433 మందిని గుర్తించామని, స్కూల్స్ ప్రారంభించే నాటికి వారిని స్కూల్స్ లో చేర్పించడం కోసం సచివాలయ వారీగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రవేటు స్కూల్స్ లో 25 శాతం  పేద ,  నిరుపేద పిల్లలకు కేటాయింపు విషయంలో ఇప్పటికే 440 స్కూల్స్ లకు గాను 349 స్కూల్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందన్నారు.  వాటిలో 1005 పిల్లలు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలియ చేశారు.


ఈ సమావేశంలో  జిల్లా అధికారులు పాల్గొన్నారు.



Comments