ఏపీ విద్యా సంస్కరణల ద్వారా మరింత పురోగతి సాధించవచ్చు.

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా*

విజయవాడ (ప్రజా అమరావతి);

*ఏపీ విద్యా సంస్కరణల ద్వారా మరింత పురోగతి  సాధించవచ్చు


*

అమెరికన్ ఆర్ధిక నిపుణులు శ్రీ  లాంట్ ప్రిట్‌చెట్


భారతదేశంలో 1950 నుండి 1995 వరకు పాఠశాలల్లో బాలికల నమోదులో పురోగతి బాగుండేదని,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న విద్యా సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో మరింత పురోగతి సాధించవచ్చని సుప్రసిద్ధ అమెరికన్ ఎకనామిస్ట్, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు  శ్రీ   లాంట్ ప్రిట్‌చెట్ అన్నారు. శ్రీ లాంట్  ప్రిట్ చెట్ 20 ఏళ్లకు పైగా విద్యా, ఆర్ధిక అభివృద్ధి అంశాల్లో అనుభవజ్ఞులు.  

  సోమవారం విజయవాడలోని  SALT(ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సపోర్టింగ్) కార్యాలయాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా  సాల్ట్,  సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ, సీమ్యాట్, శామో బృందాలతో భేటీ అయ్యారు.  

విద్యారంగంపై వివిధ దేశాల్లో గత 20 ఏళ్లుగా సాగిన అధ్యయనంపై  దృష్టి సారించిన అంశాలు, వివిధ పరిశోధనల్లోని స్వానుభవాలు పంచుకున్నారు.  సమావేశానంతరం శ్రీ   లాంట్ ప్రిట్‌చెట్ గారికి పాఠశాల విద్య కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు,  సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు గారు ఆయన్ను సత్కరించి,  విలువైన సమాయాన్ని కేటాయించి, విద్యారంగ ఆసక్తికర విషయాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య గారు తదితరులు పాల్గొన్నారు.శ్రీ లాంట్  ప్రిట్ చెట్  విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలు (లెర్నింగ్ అవుట్ కమ్స్) పై చర్చించి, వివిధ మార్గదర్శకాలు, అభిప్రాయాలు పంచుకున్నారు. 

Comments