ప్రజల నుండి అందే స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి.



మచిలీపట్నం మే 1(ప్రజా అమరావతి);


ప్రజల నుండి అందే స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాల


ని సంయుక్త కలెక్టర్ డా. అపరాజిత సింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు


సోమవారం ఉదయం సంయుక్త కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శివ నారాయణ రెడ్డి, మచిలీపట్నం ఆర్డిఓ ఐస్ కిషోర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ చైతన్య లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

వారు సంబంధిత అధికారులను పిలిపించి ప్రజల విజ్ఞప్తులను తెలియజేసి సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.


పరిష్కరించినప్పటికీ మళ్లీ వచ్చిన దరఖాస్తులను ప్రస్తావిస్తూ సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని పరిష్కరించాలని ఇకపై వచ్చిన దరఖాస్తులే మళ్లీ రాకుండా సరిగా పర్యవేక్షించాలన్నారు.


ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, జడ్పీ సీఈవో జ్యోతిబసు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిపిఓ నాగేశ్వర్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్.ఈ.లు  సత్యనారాయణ రాజు, రమణారావు, ముడ విసి రాజ్యలక్ష్మి, సిపిఓ వై శ్రీలత, డిఎస్ఓ పార్వతి,జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి  షంసున్నీసా బేగం, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సరస్వతి, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్,  డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, సర్వే  భూ రికార్డుల ఏడి గోపాల్, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీహరి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు


Comments