జిల్లాలో ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి

 


మచిలీపట్నం, మే 1 (ప్రజా అమరావతి);

  

జిల్లాలో ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.


సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్వో ఎం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన అర్జీల పరిష్కారం, పేదలందరికీ ఇళ్లు, రీ సర్వే తదితర కార్యక్రమాల పై  సమీక్షించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలుపరిచేందుకు ఈనెల తొమ్మిదో తేదీన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.

ఇందులో భాగంగా  గ్రామీణ ప్రజల సమస్యలు గ్రామ సచివాలయాల పరిధిలోనే పరిష్కారం కావాలన్నారు. వారి పరిధిలో పరిష్కరించలేనివి  మండలము లేదా డివిజన్లో పరిష్కారం కావాలన్నారు. అక్కడ కూడా పరిష్కారం లభించని సమస్యలకే జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ప్రజలు అర్జీలు తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు.

ఆ ప్రకారంగా ప్రజలకు సరైన అవగాహన కలిగించి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా అధికార యంత్రాంగం యావత్తు పకడ్బందీగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. 

మండలాలు, డివిజన్, జిల్లా స్థాయిల్లో ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుందన్నారు.

స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా విధిగా పర్యవేక్షించాలన్నారు

గ్రామ వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అందిస్తున్న వివిధ రకాల సేవలను ప్రజలకు విశదీకరించాలన్నారు



 పేదలందరికీ ఇళ్ళు-వైయస్సార్ జగనన్న లేఔట్ ల నిర్మాణ కార్యక్రమమం కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమమన్నారు.

  

ప్రస్తుతం బిబిఎల్ దశలో ఉన్న 20,585 ఇళ్లను బి.ఎల్ దశలోకి తీసుకురావాల్సి ఉందన్నారు.

ప్రతిరోజు 1354 ఇళ్లను  బిపిఎల్ నుండి బిఎల్ దశకు  తీసుకురావాలని లక్ష్యం కాగా గత రెండు రోజులుగా కేవలం 381 ఇళ్లను మాత్రమే బి ఎల్ దశకు తీసుకువచ్చారన్నారు.

ఇకపై రోజువారి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించేందుకు సంబంధిత అధికారులతో పాటు ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్ తాసిల్దార్ డి ఆర్ డి ఏ అధికారులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా జగనన్న లేఔట్లలో తప్పనిసరిగా నీరు, విద్యుత్తు, ఇసుక తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

 డిఆర్డిఏ తరఫున లబ్ధిదారులకు బ్యాంకు రుణాలను అందించి నిర్ణీత లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పాటు అందించడంతోపాటు ఇళ్ల నిర్మాణం ప్రారంభమై పూర్తి చేసేందుకు తమ వంతు బాధ్యత తీసుకోవాలన్నారు.

గృహ నిర్మాణంలో వెనుకబడిన పెదపారుపూడి, గన్నవరం, పెనమలూరు, బాపులపాడు నాగాయలంక, పామర్రు ఉయ్యూరు తదితర మండలాల్లో సరైన పురోగతి సాధించేందుకు సంబంధిత ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు.

 ఈ విషయం తేలిగ్గా తీసుకోరాదని స్పష్టం చేస్తూ వచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ నిర్మాణంలో మంచి పురోగతి సాధించాలన్నారు.


 మండలాల్లో కొంత  పురోగతి ఉన్నప్పటికీ గుడివాడ, మచిలీపట్నం, పెడన  ఉయ్యూరు పట్టణాల్లో అనుకున్న స్థాయిలోసరైన పురోగతి లేకపోవడంతో జిల్లా మొత్తం పురోగతి వెనుక పడుతుందన్నారు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. సూక్ష్మస్థాయిలో సమీక్షించి గృహ నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తూ అనుకున్న విధంగా పురోగతి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.



ఈ టెలి కా ఆర్డీవోలు,మున్సిపల్ కమిషనర్లు,  ఎంపీడీవోలు, తహసిల్దార్లు, తదితర అధికారులు పాల్గొన్నారు


Comments