నెల్లూరు: మే 3 (ప్రజా అమరావతి);
స్పందనలో వస్తున్న అర్జీలు నిర్ణీత గడువులోగా పరిష్కరించాల
ని, ప్రజా సమస్యలకు సంబంధించి వచ్చే అర్జీలు మళ్లీ మళ్లీ పునరావృతం ( రీ ఓపెన్) అయితే సహించేది లేదని కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అధికారులను హెచ్చరించారు .బుధవారం సాయంత్రం స్పందన లో వచ్చే అర్జీల పరిష్కారంపై జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సమస్యలు పరిష్కారం చేయాలని సూచించారు. స్పందనలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించడంతోపాటు సంతృప్తికరమైన పరిష్కారం చూపించాలని ఆయన అన్నారు.. కొంతమంది క్రింది స్థాయి అధికారులు సక్రమంగా పరిష్కరించకుండా పరిష్కారం అయినట్లుగా ఎండార్స్మెంట్ చేస్తున్నారని అలాంటివి సహించేది లేదని ఆయన అన్నారు . స్పందన సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ అన్నారు .పిటీషన్ల పరిష్కారం పై ఎన్నిసార్లు సూచనలు సలహాలు ఇచ్చిన అధికారుల్లో మార్పు రావడంలేదన్నారు.స్పందన అర్జీల పరిష్కారంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గతవారం కంటే ఈవారం రీ ఓపెన్ కేసులు కేసులు పెరిగాయని అందువల్ల జిల్లా అధికారులందరూ జాగ్రత్తగా ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెవిన్యూ, పౌరసరఫరాలు, పంచాయితీ రాజ్, మున్సిపల్, పోలీస్ శాఖలకు సంబంధించి పిటిషన్లు వస్తున్నందున ఆ శాఖల అధికారులు పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున అధికారులందరూ స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కన్నారు.
జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, డి ఆర్ ఒ.వెంకట నారాయణమ్మ, డి ఆర్ డి ఎ. పి డి సాంబశివా రెడ్డి, వివిధ శాఖల అది కారులు తిక్కన మీటింగ్ హాల్ నుండి వి. సి.లో పాల్గొన్నారు.
addComments
Post a Comment