పెండింగ్ లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి.

 *పెండింగ్ లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి*



*: జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 16 (ప్రజా అమరావతి):


జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ఎలాంటి పెండింగ్ లేకుండా వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెళ్లే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తిగా చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ఇంకా 127 హెక్టార్లకు సంబంధించి భూములు సేకరించిన రైతుల బ్యాంక్ అకౌంట్ల వివరాలు, ఆధార్ కార్డుల వివరాలను త్వరగా అందజేయాలన్నారు. బ్యాంక్ అకౌంట్ల వివరాలు, ఆధార్ కార్డుల వివరాలు అందిస్తే రైతులకు వేగవంతంగా పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. సకాలంలో భూసేకరణ పూర్తి చేసి రహదారుల నిర్మాణం వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్, పుట్టపర్తి, కదిరి ఆర్డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, కలెక్టరేట్ జి సెక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ, ఆయా మండలాల తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.



Comments