*ప్లేస్ మెంట్ ఆర్డర్ లు అందించిన జిల్లా కలెక్టర్
*
పార్వతీపురం, మే 5 (ప్రజా అమరావతి): నైపుణ్యాభిృద్ధి సంస్థలో శిక్షణ పొందిన 22 మంది అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్లేస్ మెంట్ ఆర్డర్ లు అందించారు. జిల్లా కలెక్టరు కార్యాలయంలో శుక్రవారం అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్నందుకు సర్టిఫికేట్ లను పంపిణీ చేశారు. నైపుణ్యం మెరుగు పరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఉద్బోధించారు. స్వంత కాలపై నిలబడాలని ఆయన సూచించారు. ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తేవాలని, ఉపాధి కోసం ఎదురు చూసే వారికి స్ఫూర్తిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యూ. సాయి కుమార్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యలను మెరుగుపరిచి వారికి ఉపాధి బాటలు వేసేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ అడుగులువేస్తోందన్నారు . ఇoదులో భాగంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, ఎం.ఆర్ నగరం, పార్వతీపురం స్కిల్ హబ్ లో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కోర్స్ లో 28 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, అందులో 22 మంది విశాఖపట్నంలో గల అరౌనా ఇంజనీరింగ్ అండ్ సర్వే సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎంపిక అయ్యారని చెప్పారు. ఎంపిక అయిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్, సర్టిఫికెట్స్ అందిచడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నైపుణ్యాభిృద్ధి సంస్థ సిబ్బంది, అభ్యర్దులు పాల్గొన్నారు.
addComments
Post a Comment