పెంటపాడు/ అత్తిలి, మే 05 (ప్రజా అమరావతి);
*రైతులను కష్ట కాలంలో ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామ
ని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియో గదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరరావు అన్నారు*...
శుక్రవారం పెంటపాడు మండలం ఆకు తీగల పాడు, గణపవరం మండలం మొయ్యేరు,అత్తిలి మండలం అత్తిలి మార్కెట్ యార్డులో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అకాల వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, వర్షాలవల్ల ధాన్యం బస్తాలు అన్ని ఒకేచోట ఉండి పోవడం వల్ల వాటిని తరలించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. తేమ శాతం 18%, 19 % ఉన్నా కూడా రైతుల నుండి కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం జరుగుతుందని ఆయన అన్నారు. నూక శాతం వలన కూడా ఏమి ఇబ్బందులు లేకుండా రైతుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసు కోవడం జరిగిందని మంత్రి తెలిపారు. కృష్ణాజిల్లాలో ఉన్న 6 బాయిల్డ్ రైస్ మిల్లులు, ఏలూరు ఉన్నజిల్లాలో ఉన్న రెండు బాయిల్డ్ రైస్ మిల్లర్లకు కోసిన ధాన్యాన్ని నేరుగా తరలించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. రైతులు ఆనందంగా ఉండే విధంగా చర్యలు తీసు కున్నామని అయన తెలిపారు. రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులకు మిల్లర్ల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు రైస్ మిల్లర్లకు సంబంధం లేదనే విషం తెలియక, ఇంకా రైతులు అపోహ పడుతున్నారని అన్నారు. రైతులు ఆర్ బి కే లో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత అని, తర్వాత మిల్లర్లు పిలిచిన వెళ్లవలసిన అవసరం లేదన్నారు. కొంతమంది మిల్లర్లు రైతులకు ఫోన్ చేసి నూక అవుతుంది మిల్లుకు రావాలని పిలుస్తున్నారనే ఫిర్యాదు వచ్చిన వెంటనే నిన్న మూడు మిల్లులు , ఈరోజు రెండు మిల్లులను సీజ్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు .అకాల వర్షంతో రైతుల వద్ద ఉన్న ధాన్యం ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులు ,మిల్లర్ల మధ్య దళారీలు లేకుండా ప్రతి రైతును ఆదుకునే విధంగా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రైతు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర రూ 1530 రూపాయలు రైతుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు . రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు, మిల్లర్లకు దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకున్న అతి ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈరోజు ఒక్కరోజే పశ్చిమగోదావరి జిల్లాలో 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. యుద్ధ ప్రాతిపదిన యుద్ధ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 1075 కోట్లు రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటికి 805 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 80% డబ్బులు జమ చేయడం జరిగిందని మంత్రి కారుమూరి. వెంకట నాగేశ్వరావు తెలిపారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ అకాల వర్షాలు వల్ల రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. అకాల వర్షాలు వల్ల ఇంకా తడిగా ఉన్నా కూడా రైతులకు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు .మిల్లర్లు ఇచ్చిన బ్యాంక్ గారెంటీ 1:2 ప్రకారం వారికి ధాన్యం మిల్లులకు దింపడం జరుగుతుందని ఆయన తెలిపారు . దాన్యం తరలించేటప్పుడు రైతులు గన్ని బ్యాగులు, రవాణా చార్జీలు రైతు పెట్టుకున్నట్లైతే వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఇంకా ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రతి రైతు కోసిన ధాన్యాన్ని బద్రపరుచుకోవాలని ఆయన సూచించారు .ధాన్యం లో తేమశాతం 18 ,19 శాతం ఉన్నా కూడా కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం జరుగుతుందని ఆయన అన్నారు.ఎవరైనా మిల్లర్లు ఇబ్బంది పెట్టినట్లయితే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన సూచించారు
ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి, భీమవరం ఆర్డీవో దాసిరాజు , అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్ భుద్ద ప్రసాద్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్ , రైతులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment