పెడన నియోజకవర్గ పరిధిలో నైట్ వాచ్మెన్ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి జోగి రమేష్.

 

పెడన, మే 4 (ప్రజా అమరావతి);


*పెడన నియోజకవర్గ పరిధిలో నైట్ వాచ్మెన్ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి జోగి రమేష్



రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గురువారం పెడనలో తమ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలో నైట్ వాచ్ మేన్ గా నియమించబడిన వారికి నియామక పత్రాలు అందజేశారు. పెడన అర్బన్ /రూరల్ 7 మందికి, కృత్తివెన్ను 11, బంటుమిల్లి 10,  గూడూరు మండలంలో 7 మంది మొత్తం 35 మందికి నియామక పత్రాలు అందించారు


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనసున్న ముఖ్యమంత్రి జగనన్న అన్ని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్మెన్ లను నియమించాలని ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గ పరిధిలో ఈరోజు 35 మందిని నైట్ వాచ్మెన్ గా నియమించి వారికి నియామక పత్రాలు అందించామన్నారు.


 నియామకాలు పొందిన వారు బాధ్యతగా పనిచేయాలని సూచించారు మన ఇంటిని ఏ విధంగా కనిపెట్టుకొని ఉంటామో, పరిశుభ్రంగా ఉంచుతామో, కాపాడుకుంటామో అదేవిధంగా పాఠశాలను నా ఇల్లు అనే భావంతో పాఠశాలను విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాలని, పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెడును ప్రోత్సహించవద్దని , అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నివారించాలని అన్నారు. మీ గ్రామంలో మీ ఇంటి వద్ద ఉండే పాఠశాలలో మీరు పనిచేసే అవకాశం కలిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ మెచ్చేలా మిమ్మల్ని అభిమానించేలా పనిచేయాలని హితవు పలికారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బళ్ల జ్యోత్స్న రాణి గంగయ్య, గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు, పెడన ఎంపీపీ రాజులపాటి అచ్యుత రావు, పార్టీ అధ్యక్షులు కొండవీటి నాగబాబు, బండారు మల్లి, గొరిపర్తి రవి, సచివాలయ కన్వీనర్లు మతిన్ ఖాన్, బెజవాడ నాగబాబు వైస్ ఎంపీపీలు నేతల కుటుంబరావు, యాదంరెడ్డి వెంకటేశ్వర రావు, మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు జన్యవుల ఝాన్సీ, సర్పంచులు బండారు చంద్రశేఖర్ , మందపాటి ప్రదీప్, కౌన్సిలర్లు పిచ్చుక సతీష్, గరికి ముక్కు చంద్రబాబు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,  పేరెంట్స్ కమిటీ, విద్యా కమిటీ చైర్మన్ లు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments