కామారెడ్డిలో నువ్వా❓️ నేనా❓️ అగ్ర నేతల మధ్య ఉత్కంఠ పోరు.

 *కామారెడ్డిలో నువ్వా❓️ నేనా❓️ అగ్ర నేతల మధ్య ఉత్కంఠ పోరు*












హైదరాబాద్‌:అక్టోబర్ 28 (ప్రజా అమరావతి);

ఒకప్పుడు కీలక స్థానాల జాబితాకు ధరిదాపుల్లో కూడా కనిపించని కామారెడ్డి నియోజకవర్గానికి ఉన్నట్లుండి ఊహించనంతగా హైక్‌ వచ్చేసింది. ఎక్కడ, ఏ మూలన ఎన్నికలపై చర్చ జరిగినా.. కామారెడ్డి రాజకీయమే కీలకంగా మారనుంది,


ఉద్దండులు తలపడుతున్న స్థానంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. గెలు పోటములు ఎలాగున్నా.. నువ్వా నేనా.. అనే స్థాయిలో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. కారణమేమైనప్పటికీ అధికార భారాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి.


కామా రెడ్డిలో కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ రెడ్డి? అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళినప్పటి నుంచీ ఈ రెండు ప్రధాన పార్టీల కేడర్‌ ప్రచార వ్యూహాలతో సమాయత్తమవుతోంది. అభివృద్ధే ఆయుధమన్న పంథాతో ఇప్పటికే ప్రచారంలో దూసుకు పోతున్న భారాస కేడర్‌ తమదే పైచేయి అని ఎలుగెత్తి చాటు కుంటోంది.


అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ అ న్న నినాదంతో కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది.ఈ క్రమంలో రాజకీయ నిపుణులు, విశ్లేషకుల దృష్టి అం తా కామారెడ్డి సెగ్మెంట్‌ పైనే కనిపిస్తోంది. ఏ గ్రామం ఎటు వైపు..? ఏ నాయకుడి పనితీరు ఎలా..? ఏ పార్టీకి ఎన్ని ఓ ట్లు..? అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.


గతానికి భిన్నంగా కామారెడ్డి నియోజకవర్గం పేరు రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం చర్చగా మారుతోంది. ప్రము ఖులు కామారెడ్డి నుంచి బరిలో నిలవడంతో ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ ప్రాముఖ్యతను సంతరించుకుంది.


ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి బరిలో దిగారు. తాజాగా టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఇక్కడి నుంచి కూడా పోటీ- చేసేందుకు సంసిద్ధమయ్యారు. ఇదే జరిగితే రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు ఒకే అసెంబ్లీ నుంచి పోటీ- చేస్తుం డడం, బలాబలాలను చాటుకునే ప్రయత్నాలు ముమ్మ రంగా జరుగుతుండడం లాంటి అంశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.


కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ప్రముఖుల మధ్య పోటీ-కి వేదికైంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలు కామారెడ్డిలో తలపడుతుండడం ఆ ఒక్క నియోజకవర్గానికే కాదు.. రాష్ట్రమంతా అటువైపే దృష్టి పెట్టే పరిస్థితులు వస్తున్నాయి.


ఈ సమరంపై సామాన్య ప్రజలు మొద లుకుని అగ్రశ్రేణి నాయకుల వరకూ అందరి దృష్టి కేంద్రీకృ తమైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ తన స్థానం గజ్వేల్‌తో పా టు- కామారెడ్డి నుంచి బరిలో నిలుస్తున్నట్లు ప్రకటిం చడంతో పాటు ప్రచారం కూడా మొదలుపెట్టారు.


నవం బర్‌ 9న నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్ప టికే ప్రచారం, వ్యూహాలు, మేనిఫెస్టో వంటి అంశాలతో నియోజకవర్గ నేతలు ప్రచారంలో ఉన్నారు. ఇక కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ప్రచారం మొదలు పెడితే రాజకీయం వేడెక్కనుంది..

Comments