*అండర్ 14 జిల్లా స్థాయి కోకో పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి
*
కారంపూడి (ప్రజా అమరావతి);
స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారంపూడి నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్ 14 ఖో ఖో జట్ల ఎంపికలు కారంపూడి లోని బ్రహ్మ నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుండి సుమారు గా 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా SGFI సెక్రెటరీ సురేష్, అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు అనంత శివ, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ బాలునాయక్, పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు మోదిన్సా, పంగులూరి అంజయ్య, ఉన్నం లక్ష్మీనారాయణ, పంగులూరి పుల్లయ్య, చప్పిడి రాము, బుల్నేటి శీను, కటికల బాలకృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లాలో నుంచి నలుమూలల నుండి సుమారుగా 50 మంది వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment