గుంటూరు, 27 మే 2025 (ప్రజా అమరావతి): జిల్లాలో బక్రీదు పర్వదినంను ప్రశాంత వాతవరణంలో ఆంధ్రప్రదేశ్ గోవధ నిరోధక చట్టం 1977 నిబంధనలకు అనుగుణంగా జరుపుకునేలా అధికారులు సమన్వయంతో ప్రణాళికా ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ 07.06.2025 న జరగబోవు బక్రీదు పండుగ సందర్బంగా గుంటూరు జిల్లా జంతు హింస నివారణ సంఘం సమావేశంను అధికారులు, జంతు హింస నిరోధక సంఘం ప్రతినిధులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ బక్రీదు పర్వదినం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గోవధ నిరోధక చట్టం 1977 నిబంధనల ప్రకారము గోవధలు నిరోధించడానికి జిల్లాలోని అందరు అధికారులు అప్రమత్తంగా ఉండాల
న్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితిలోను ఆవులను, చూలు పశువులను, 3 నెలల దూడలు కలిగిఉన్న పశువులను వధించరాదన్నారు. జంతు రవాణా నిబంధనల మేరకు సరైన ధృవీకరణ పత్రం లేకుండా జంతువులను రవాణా చేయరాదని, చట్టనిబంధనలకు లోబడి అనుమతించబడిన జంతువులను మాత్రమే నిర్ణయించబడిన జంతువధశాలలో మాత్రమే వధ చేయాలని, జంతు వధ నిరోధక చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బక్రీదు సందర్భంగా గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పి.సి.ఎ.చట్టం నిబంధనలు అమలు , పర్యవేక్షణ కొరకు నాలుగు బృందాలు , తెనాలి, పొన్నూరు, ఎం.టి.ఎం.సి పరిధిలో రెండు బృందాలు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న జంతు హింస నివారణ సంఘం సభ్యులు తెలిపిన పలు అంశాలపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ స్పందిస్తూ అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా జంతువులు రవాణా జరగకుండా పోలీస్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ గోవధ నిరోధక చట్టం, 1977 నిబంధనలు ఉల్లంఘించి కేసులు నమోదు చేసిన వారిని ముందస్తుగా పోలీస్ శాఖ వారు బైండోవర్ చేయాలన్నారు. జంతువధ కేంద్రాలలో నిబంధనలు ప్రకారమే నిర్వహించేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనధికారికంగా జంతువధశాలలు నిర్వహించకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిరంతం పర్యవేక్షించాలన్నారు. జంతువధ శాలలు వద్ద మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం పక్కాగా నిర్వహించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా అదనపు ఎస్ పి సుప్రజ మాట్లాడుతూ పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జంతువుల అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందరు పోలీసు అధికారులు గోవధ నిరోధక చట్టం తు.చా తప్పకుండా అమలు చేయవలెనని ఏ వర్గము వారు శాంతి సామరస్యములకు విఘాతం కలిగించకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించవలెనని కోరారు.
జిల్లాలో బక్రీదు పర్వదినం సంధర్భంగా ఎటువంటి చట్ట ఉల్లంఘన జరిగిన పిర్యాదు చేయవల్సిన నెంబర్లు.
పోలీస్ శాఖ: 86888 31307
పశుసంవర్ధక శాఖ: 9989932864
గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్: 9849277904
పొన్నూరు మునిసిపాలిటీ: 9849905834
తెనాలి మునిసిపాలిటీ: 6301666369
ఎంటీఎంసీ...: 9849907301
సబ్ కలెక్టరు, తెనాలి: 9849904008
రెవిన్యూ డివిజనల్ అధికారి, గుంటూరు: 9849904006
జిల్లా పంచాయతీ అధికారి, గుంటూరు: 9492758041
సీఈఓ జడ్పీ...: 9849903355
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా పంచాయితీ అధికారి సాయి కుమార్, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ డీడీ సత్యన్నారాయణ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎస్ కే ఎం షరీఫ్, జిల్లా పరిషత్ ఏఓ శామ్యూల్ పాల్, జీఎంసీ ఎంహెచ్ఓ డా. రవిబాబు, ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనరు శ్రీనివాసులు, జంతు హింస నివారణ సంఘం సభ్యులు శివరాం, హరిహరరాయులు, చలపతిరావు, జాగు సురేష్, సుఖరాజ్, గుంటూరు తూర్పు మండల తహశీల్దారు సుభాని, పశ్చిమ మండల తహశీల్దారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment